Home Top Ad

Responsive Ads Here

Impact of 6 'Arishadvargas' on your life అరిషడ్వార్గములు అను దుర్గుణములు మానవుడ్ని ఏ స్థిథికి తీసుకువస్తాయి?


అరిషడ్వార్గములు అను దుర్గుణములు మానవుడ్ని ఏ స్థిథికి తీసుకువస్తాయి?


మొదటిది కామము. 

ధర్మవిరుద్ధమైన కోరికలతో, కంటికి నచ్చిన ఆడదాని కోసం వెంపర్లాడేలా చేసి, ధన, మానాలను మనుజులకు పోగొడుతుంది. 


రెండవది క్రోధము. 


కామము వలన క్రోధము పెరిగి, ఆత్మీయులను దూరం చేస్తుంది. శత్రువుల్ని దగ్గర చేస్తుంది.


మూడవది లోభము .


లోభము వాళ్ళ తన దానం తనకూ, తనవారికి కూడా దక్కకుండా చివరకు అన్యులకూ,అర్హతలేని వారికి అందుతుంది.


నాలుగవది మోహము.


'నాది' అనే భ్రమలో 'నీది' అనునది పోగొట్టేది. 


ఐదవది మదము.


మనకున్న కొద్దీ పాటి శక్తులను చూసుకుని విర్రవీగటము. 


ఆరవది మాత్సర్యము.


పరులని చూసి ఈర్ష్య పొందుతూ, ద్వేషిస్తూ, పగతో అహంకార పూరితంగా ప్రవర్తించి తన్ను తాను కోల్పోవటము.

1 comment: