Home Top Ad

Responsive Ads Here

Why do we break coconut in the temples? దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు?

దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు?



సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ఞ, హోమాదుల్లోనూ, కొన్ని శుభాకార్యాల్లోను కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరి కాయపైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామనీ, లోపలున్న తెల్లని కొబరిలా మన మనసును సంపూర్ణనంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా తమ జీవితాలని ఉంచమని అర్థం . సృష్టి మొత్తంలో నీరున్న కయ కోబ్బరికాయే.


కొబ్బరికాయ అంటే మానవ శరీరం. బొండం పైనున్న చర్మం, మన చర్మం... పీచు మనలోని మాంసం, పెంకే ఎముక, కొబ్బరే ధాతువు, అందులోని కొబ్బరినీరు మన ప్రాణాధారం... కాయపైనున్న మూడు కళ్ళు ఇడ, పింగళి, సుషుమ్న అనే నాడులు.

No comments