Home Top Ad

Responsive Ads Here

Why to wash our legs before entering into a temple? దేవాలయంలోకి వెళ్లే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి?



దేవాలయంలోకి వెళ్లే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి?




గుడికి బైలుదేరామంటే స్నానం చేసే బైలుదేరుతాము. అయినా గుడి బయట పంపు లేదా నల్ల దగ్గర మళ్ళీ కాళ్ళు కడుక్కొని వెళతాము. దానికి కారణం స్నానం అయ్యాక, బైలుదేరేముందు చెప్పులు ధరిస్తాము. కావున ముందుగా గుడి బైట పాదరక్షలను వదిలి, పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి, పంచభూతాలకు అధిపతి అయినా నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ, ఆపాదమస్తకం పరిశుభ్రం చేసుకోవడానికి, తొలుత రెండు కాళ్ళు వెనక, ముందూ తడిచేలా కడుక్కుంటాము. మూడుసార్లు పుక్కిలించి నీటిని బైటికి వదలాలి.

'దేవుడా! శరీరము, వాక్కుకి మూల కారణమైన నాలుకా, నోరు కూడా శుభ్రపరుచు కొని నీ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాము. కావున మమ్ము దీవించు' అని అర్థం. అందుకే విధిగా దేవాలయంలోకి వెళ్లే ముందూ కాళ్ళు, నోరూ శుభ్రపరుచుకొని దర్శించుకోవాలి.

No comments