Home Top Ad

Responsive Ads Here

What are the good results one gets by recitation of Bhagavathgita? భగవద్గీతను పారాయణం చేయుట వల్ల ఏఏ పుణ్యఫలాలు వస్తాయి?

పారాయణం అంటే భక్తి శ్రద్ధలతో చదివి, తద్వారా చదివింది ఆచరించడం.



అర్జున విషాద యోగ పారాయణ ద్వారా పాపాలు తొలుగుతాయి. పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. సాంఖ్యయోగం ద్వారా ఆత్మ స్వరూప మును తెలుసు కొనగలుగుతారు. కర్మయోగం ద్వారా మీ చుట్టూ ఉన్న ప్రేతాత్మలు తొలిగిపోతాయి. జ్ఞాన యోగ పారాయణం ద్వారా పశు, వృక్ష, పక్షు పాపాలు కూడా నశించి ఉత్తమమైన లోకాలని చేరుతాయి. తద్వార మీకు పుణ్యప్రాప్తి.

అత్మనంయమ యోగం ద్వారా అనేక దానములు చేసిన పుణ్య ఫలం లభిస్తుంది. విజ్ఞాన యోగం ద్వారా జన్మరాహిత్యమూ, అక్షర పరబ్రహ్మయోగం ద్వారా సమస్త దుర్గుణాలూ  నశిస్తాయి. రాజ విద్యా రాజ గుహ్యయోగం ద్వారా పరుల సాత్తును అపహరించిన పాపములు పోతాయి. విభూతి యోగం ద్వారా సకల పాప విముక్తి కలుగుతుంది. భక్తి యోగం ద్వారా ఇష్టదేవతా దీవెనలు  లభిస్తాయి.

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం ద్వారా సకల దోషాలు, చెడూ తొలిగిపోతాయి. గుణత్రయ విభాగయోగం పారాయణం ద్వారా అనేక స్త్రీలతో పోయిన పాపములు, స్త్రీ దోషాలూ పోతాయి. పురుషోత్తమ ప్రాప్తి యోగం ద్వారా సర్వపాపాలూ పోయి ఉత్తమ మోక్షాలు సంక్రమిస్తాయి. భోజనానికి ముందు చదివితే మరింత మంచిది. దైవాసుర సంపద్విభాగయోగం ద్వారా అమితశక్తి వంతులవుతారు. శ్రద్ధాత్రయ విభాగయోగం పారాయణ ద్వారా అనేక దీర్ఘరోగములు నశించి క్షీణిస్తాయి. మోక్షసన్యాసయోగం పారాయణ ద్వారా అనేక యజ్ఞములు చేసిన ఫలములు కలుగును.

Note: ఈ సమాచారం కనుక నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే, share  చేయండి like చేయండి.

No comments