Home Top Ad

Responsive Ads Here

What are Mother, Father, Guru and Rishi Debt? మాతృ, పితృ, ఆచార్య, దైవ, ఋషి రుణాలంటే ఏమిటి?


మాతృ, పితృ,  దైవ, ఋషి రుణాలంటే ఏమిటి?



పశువులు, పక్షులు లాగా పుట్టగానే, కాళ్ళు రాగానే మన తల్లి తండ్రులు బైటికి తరిమెయ్యారు. తల్లీ, తండ్రీ ఇద్దరూ జీవితకాలం సంపాదించిన ధన్నాన్ని పోగు చేసి ఇచ్చి, పెళ్లి కూడా చేసి ధర్మ, అర్థాలతో సుఖించే పరిస్థితులని సృష్టిస్తారు. ప్రేమతో పెంచుతారు. 

దైవఋణం అంటే?
గాలి, నీరు, ఆహారం, అగ్ని, పగలు, రాత్రి, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఓషధులు, వృక్షాలు మొదలైన ప్రకృతి ప్రసాదించిన సమస్త సౌలభ్యాలకు ప్రతిగా తన ఋణాన్ని తీర్చుకోవటం, కృతజ్ఞతా భావనతో ప్రకృతిసంపదను కాపాడటం 'దైవఋణం'.

మాతృ, పితృఋణం అంటే?

తనకు జన్మనిచ్చి, తనలో రక్తమాంసాదుల నింపి, మల మూత్రాదులను కడిగి, వైద్యసేవలు చేసి, అన్నపానీయాదుల్ని సమకూర్చి పెట్టి, పెద్దజేసి మాటనేర్పి, విద్యాబుద్ధుల్ని నేర్పించి ప్రయోజకునిగా చేసి, గృహక్షేత్ర ధనాదుల నిచ్చిన తల్లిదండ్రులను వార్డ్యక్య జీవితంలో సేవించి కాపాడటం “పితృఋణం".

తల్లీ, తండ్రీ ఋణం, ఎంత సేవ చేసిన తీరదు. చేయాల్సిందల్లా ముసలితనంలో వారిని బిడ్డల్లా చేసుకోవటమే. మల మూత్రాలను కడిగి పెంచి పెద్ద చేసినందుకు ఆ సమయంలో అలా ఋణం తీర్చుకోవాలి.

ఋషిఋణం అంటే?

ఈ సృష్టిలోని సకలసౌకర్యాలను మనం మాత్రమే కనిపెట్టలేదు.మనకంటే ముందుగా జన్మించిన పరోపకారబుద్ధులైన మహర్షులెందరో ఎంతోకాలం శ్రమించి, గణిత, ఖగోళ విజ్ఞానాన్ని మనకు అందించారు. మనం తినే ఉప్పు చింతపండు దగ్గరనుండి శరీరానికి శక్తిని అందించే కూరగాయల వరకు వారి దయాభిక్షే! ఆయుర్వేద వైద్యం నుండి పసుపు వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర వరకూ వాటి పోషక విలువల్ని తెలుసుకొని మనకు అందించింది ఋషులే. కాబట్టి సనాతనులైన వారందరి ఋణాన్నీ విద్యార్జన చేయటం ద్వారా వారు రచించిన గ్రంథాలను చదివి గ్రహించి సమస్త ప్రజలకు తెలుపటం ద్వారా ఋషిరుణాన్ని తీర్చుకోవాలి. ఇదే “ఋషి ఋణం".

లోక జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నేర్పినందుకు గురు ఋణాన్ని, మనకి బుద్ధిని, కర్మని ఇస్తున్న దైవ ఋణాన్ని భక్తి ద్వారా ధర్మ మార్గం ద్వారా, సకల శాస్త్రాలను, ధర్మాలను గ్రంధాల ద్వారా మనకు అందచేసినందుకు ఋషి ఋణాన్ని తీర్చుకోవాలి. వివాహం ద్వారా అన్ని రుణాలని తీర్చి, తిరిగి తాను ఋణ పడటమే మానవ జన్మ.

No comments