Home Top Ad

Responsive Ads Here

Why should new couples should stay away in Ashadam month ? కొత్త దంపతులు ఆషాఢమాసం లో దూరంగా ఎందుకుండాలి ?


కొత్త దంపతులు ఆషాఢమాసం లో దూరంగా ఎందుకుండాలి ?చేత్ర వైశాఖాది పన్నెండు మాసాల్లో ఆషాఢాన్ని అశుభమాసంగా పరిగణించారు పూర్వీకులు. ఆషాఢం అనారోగ్య మాసం అని కూడా మనందరికీ తెలుసు. విపరీతమైన ఈదురుగాలులతో పుల్లచినుకులు పడే సమయం ఈ ఆషాఢమాసమే. కాలువలలోనూ, నదులలోనూ, ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా వుండి మనుషుల ఆరోగ్యాలకు హాని కల్గిస్తూ వుంటుంది.

వ్యవసాయ ప్రధానవృత్తిగా వున్న దేశం మనది. పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతన్నలు. చైత్ర - వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు వుండవు. కాబట్టే ఈ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా వుంటాయి. ఆ రోజుల్లో క్రొత్తగా పెండ్లి అయిన యువకులు ఆరునెలలకాలం అత్తగారి ఇంటిలో వుండే సంప్రదాయం వుండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవల్సిన యువకులు అత్తవారింట్లో కూర్చొని వుంటే, సకాలంలో జరుగాల్సిన పనులు జరుగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి. ఇప్పటిలాగ కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే ఆ సంవత్సరమంతా దారిద్యంతో బాధపడవల్సిందే గదా! అందుకే క్రొత్తకోడలు పుట్టింటిలోనే వుండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు. క్రొత్త పెళ్ళాం దగ్గరవుంటే పొలంపనులమీద ధ్యాస వుండదు. ఇంటిధ్యాసతో పనులు సరిగా చేయరని ఆషాఢమాస నియమం పెట్టారు.

అంతేకాకుండా అనారోగ్యమాసం ఆషాఢం. క్రొత్తనీరు త్రాగటంవల్ల చలిజ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం. స్త్రీలు గర్భం ధరించటానికి మంచి సమయం కాదు. అనారోగ్య దినాలలోనూ, అశుభ సమయాలలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలుగదనే నమ్మకం కూడా వుంది. ఆషాఢమాసంలో గర్భం ధరిస్తే నెలలు నిండే సమయానికి ఎండలు ముదురుతాయి. దానితో తల్లీ, కడుపులో బిడ్డ అవస్థలు పడతారని ఆషాఢమాసం ఇద్దరినీ దూరంగా ఉంచుతారు. కావున ఆషాఢమాసంలో భార్యకి దూరంగా ఉండటమే ఉత్తమం. అత్తాకోడళ్లు ఒక గడప దాటకూడదనీ అంటారు.

ఇన్ని కారణాలవల్ల ఆషాఢం నిషిద్ధం చేశారు పెద్దలు. ఒకరకంగా వియోగం కూడా కొత్త దంపతులకు మంచిదే. గాఢమైన ప్రేమ వియోగంనుండే పుడుతుంది. ఎదురుచూపుల్లో వుండే తీయదనం ఏమిటో ఎదురుచూచినవారికే తెలుస్తుంది. రాత్రి పగలు కలలుకంటూ ఊహల్లో తేలిపోవటం కూడా మధురమే గదామరి!

ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా దొంగచాటుగా, ఏదో రకంగా క్రొత్త పెళ్ళాన్ని కల్సుకొనే మగరాయుళ్ళు చాలామంది వున్నారు.
అదొక మధురానుభూతి !

శాస్త్రం నియమం పెట్టింది ఆచరించమని అంతేకాని లొసుగులు వెతకమని కాదు.

No comments