Home Top Ad

Responsive Ads Here

Which type of marriage is sacred one from the various types of marriages, వివాహము ఎన్ని రకాలు, అందులో పవిత్రమైనది ఏది?


వివాహము ఎన్ని రకాలు,  అందులో పవిత్రమైనది ఏది?



బ్రాహ్మీ, దైవ (ఆర్షం) ప్రజాపత్య, రాక్షస, అసుర, కన్యాశుల్క, గాంధర్వ పైశానిక మని వివాహాలు ఎనిమిదైనా, ఆర్యధర్మ ప్రకారం వివాహాల్లో, నాలుగు
రకాలు ప్రఖ్యాతం

  1. బ్రాహ్మీ వివాహం
  2. గాంధర్వ వివాహం
  3. క్షాత్ర వివాహం
  4. రాక్షస వివాహం
ఈ నాలుగు వివాహాల్లో 'బ్రాహ్మీవివాహం' విశిష్టమైనది

బ్రాహ్మీ వివాహం

ఋషి సంప్రదాయ బద్ధమైన బ్రాహ్మీ వివాహం ఆర్యసమ్మతమైన వివాహం వధూ వరుల కులపెద్దలు. తల్లిదండ్రులు అనుమతించి అంగీకరించి, ఆశీర్వదించి వైదిక విధితో ఆచారయుక్తంగా జరిపించేది. బ్రాహ్మీ వివాహం ఇది సనాతన జన సమ్మతం! సత్సంప్రదాయం

గాంధర్వ వివాహం

యువతీ యువకులిద్దరూ యుక్తవయస్సు గలవారైయుండి, ఒకరినొకరు ఇష్టపడి, పెద్దలెవరి అంగీకారమూ లేకుండా, తమంతట తాముగా రహస్యంగా కానీ, వేరొకచోటికి పారిపోయిగానీ చేసుకొనే వివాహం గాంధర్వ వివాహం. ఈ వివాహం బ్రాహ్మ వివాహమంత గొప్పదిగాడు పవిత్రమైనదీ కాదు. శకుంతల దుష్యంతుని ఈ విధంగానే పెండ్లాడి కష్టాల పాలైంది.

 క్షాత్ర వివాహం

కన్యామణి (అమ్మాయి ) అంగీకారం లేకుండా కన్య (అమ్మాయి )తరుపువారి పెద్దల అనుమతి లేకుండా వరుడు తన శౌర్య సాహసాలను ప్రదర్శించి కన్యను బలప్రదర్శనతో ఎత్తుకెళ్ళి తన స్వజనుల ( కుటుంబ )సమక్షంలో వివాహం చేసుకోవటం కాత్ర వివాహం.

ఇది కేవలం క్షత్రియ రాజులూ మాత్రమే చేసేవారు అందునా క్షత్రియ రాజా వంశీయుల కన్యను అమ్మాయిని మాత్రమే ఈ విధంగా వివాహం చేసుకునే వారు. ఇతర వర్గాలవారికి  ఈ అవకాశం లేదు.

రాక్షస వివాహం 

చతర్విధ వివాహాల్లో ఇది నీచమైన వివాహం, ఈ వివాహానికి బ్రాహ్మణ వైశ్ళ కులాలవారికి అనుమతి లేదు. ఎవరికీ తలియకుండా, దొంగతనంగా, మోసంతో, ఇష్టంలేని కన్యను అవహరించుకొనిపోయి బలవంతంగా వివాహం చేసుకోవటం రాక్షస వివాహం, శూద్ర క్షత్రియ వర్ణాలవారికి మాత్రమే ఈ వివాహం చెల్లుబాటు జరిగేది. కానీ ఇలాంటి చర్య  నాగరికత అనిపించుకోదు.

ఈ నాలుగు రకాల వివాహాలు ధర్మనమ్మతమే అయినా పెద్దల అనుమతితో జరిగే  బ్రాహ్మీ వివాహం మాత్రమే పవిత్రమైనది. బ్రహ్మి వివాహం ద్వారానే అందరికి మంచి జరుగుతుంది. వధువరుల ఇష్టాలకు, వారి కుటుంబాలకు విలువ, గౌరవం.

శతమానం భవతి

Note: ఈ సమాచారం కనుక నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే, share  చేయండి like చేయండి.


No comments