Home Top Ad

Responsive Ads Here

Why a Bride Groom should be older than bride? భార్యాభర్తల్లో పురుషునికి పెద్దవయస్సు ఎందుకుండాలి?


భార్యాభర్తల్లో పురుషునికి పెద్దవయస్సు ఎందుకుండాలి?వైదికమతం(హిందూ మతం)  మనుషులకు కొన్ని నియమనిబంధనలు విధించింది. అయితే కొందరు వైదికమతం (హిందూ మతం) పురుష పక్షపాతంతో నిండి ఉందని వాదించేవారున్నారు. ఇది కేవలం భ్రమ మాత్రమే! ఇది దృష్టిలోపమే గాని సృష్టిలోపం కాదు. అన్ని మతాలకన్నా హిందూమతానికి లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది  మానవ జీవితాన్ని సమూలంగా అధ్యయనం (study ) చేసిన సనాతన ఋషులు మనుషుల భద్రతకోసం కొన్ని నియమాలను విధించారు. అటువంటి నియమాలలో స్త్రీ పురుషుల వైవాహిక బాంధవ్యానికి పురుషునికి ఎక్కువ వయస్సు స్త్రీకి తక్కువ వయస్సు ఉండాలని  నిర్ణయించారు. వైవాహిక ఆచారాలన్నీ ఒక్కసారిగా నియమించినవి కాదు. ఒకొక్క విషయాన్నీ అనుభవ పూర్వకంగా గుర్తించి విధించటం జరిగింది.

రామాయణకాలం నాటికి స్త్రీపురుషుల వయస్సులతో నిమిత్తం ఉండేది కాదని తెలుస్తున్నది. ద్వాపరయుగంనాటికి భార్యకంటే భర్తకు ఎక్కువ వయస్సు ఉండాలని  గుర్తించి ఉంటారు.

అన్ని మతాలవారు ఈ సిద్ధాంతాన్నే అమలుపరుస్తున్నారు.

పురుషునికన్నా ఎక్కువ వయసుగల స్త్రీతో శారీరిక సంబంధాలు కల్గి ఉంటె పురుషునికి శక్తి తగ్గిపోతుందనీ, నపుంసకుడు అవుతాడనీ, అయుర్దాయం తగ్గిపోతుందని చెప్పేమాటలు నిజంకాదు! కానీ, ఇటువంటి అశాస్త్రీయ అధార్మిక అసంబద్ధ, అక్రమ  సంబంధం మంచిది కాదు.

జన్మతః  (పుట్టుకతోనే ) సామాజిక కారణాలవల్ల స్త్రీలకు సిగ్గు ఎక్కువ. వివాహానంతరం
భార్యాభర్తల మధ్య జరిగే శృంగార కార్యకలాపాల్లో ఎక్కువ చొరవ తీసికొనవల్సింది పురుషుడే! భార్యను లాలించి ప్రేమతో బుజ్జగించి, స్వంతం చేసుకోవల్చిన బాధ్యత కూడా పురుషునిదే! ఈ దృష్టితో కూడా పురుషునికి ఎక్కువ వయస్సు ఉండాల్సిందే.

పుట్టుకతో పురుషుడు స్త్రీ కంటే బలవంతుడు, ఇది మనుష్యులలోనే కాదు, పక్షులలోనూ జంతువులలోనూ పురుషశక్తిని మనం గమనించవచ్చు.  ఇది సృష్టి సహజం., స్త్రీ పురుషుల్లో సంభోగానికి (సెక్స్ కి )ముందు ఆహ్వానించవల్సింది మగవాడే అన్ని ప్రాణులలోనూ ఇదే పద్దతి వుంటుంది. గమనించండి, శృంగార కార్య కలాపాలను, రతిశాస్త్ర మెళకువలను పురుషుడు గమనించినంతగా స్త్రీలు గమనించలేరు. శృంగారకేళిలో కూడా పురుషునిదే ప్రధాన పాత్ర వుంటుంది. 

స్త్రీ నిమిత్త మాత్రంగా వుంటుంది. ఉరుములు మెరుపులు, వర్షించే ప్రకృతికేగాని భూమికి కాదుగదా! ఈ కారణంగా పురుషునికి పెద్ద వయస్సు ఉండాలి సంసారిక బాధ్యతల్లో కష్టించి పోషించాల్సిన బాధ్యత మగవానిదే. ఆర్ధిక స్థితిగతులన్నీ పురుషుడే చూసుకోవాలి. గృహబాధ్యతలు, సంతానాన్ని సక్రమంగా పెంచటం, పురుషుడు కష్టించి తెచ్చిన ధనధాన్యాదులను సక్రమంగా వినియోగించటం, పొదుపుగా గుప్తంగా కాపురం కొనసాగించటం స్త్రీ కర్తవ్యం. 

స్త్రీ శరీర నిర్మాణం పురుషుని శరీర నిర్మాణానికంటే భిన్నంగా ఉంటుంది. ప్రతినెలకూ ఋతుక్రమం రావటం, గర్భం ధరించటం, పసిబిడ్దలకు ఆహార సదు పాయాలు చూడటం, స్త్రీదేకదా ముఖ్యపాత్ర, అయితే ఆడదంటే పిల్లల్ని కనే యంత్రమా? అని ప్రశ్నిస్తుంటారు యుక్త వయసు స్త్రీలందరూ! ఇది తప్పు ఆలోచన స్త్రీ అంటే పిల్లల్ని కనే యంత్రమూ కాదు, పురుషుడంటే కుటుంబాన్ని పోషించి పెంచే భానిస కాదు.

భార్యాభర్తల్లో పురుషుడు చిన్నవాడైతే కుటుంబ పోషణా భారం స్త్రీ మీద పడుతుంది.
స్త్రీలు ఇంటి పని, బయట ఆఫీస్ పని చూసుకోవటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అప్పటి కాలంలో వ్యవసాయమే అందరికీ ప్రధాన వృత్తి ఉండేది. ఇప్పటికి మన దేశంలో చాల మంది కి వ్యవసాయం ప్రధాన వృత్తి. అప్పట్లో మనుషులే కష్టించి పని చేయాల్సి ఉండేది, ఇప్పటిలా యంత్రపరికరాలు (ట్రాక్టర్లు,machines )లేవు కదా.

Note: ఈ సమాచారం కనుక నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే, share  చేయండి like చేయండి. 

No comments