Home Top Ad

Responsive Ads Here

Why COW is given a high priority in GRUHA PRAVESHAM Ceremonies? గృహప్రవేశం చేసేటప్పుడు గోవుకి అంత ప్రాధాన్యం ఎందుకు?

గృహప్రవేశం చేసేటప్పుడు గోవుకి అంత ప్రాధాన్యం ఎందుకు?



ఎవరైనా ఇల్లు కట్టుకున్నాక బంధువులందరిని పిలిచి గృహప్రవేశం చేసుకుంటారు. ఆ సమయంలో నూతన గృహంలో ముందుగా గోవును తీసుకెళ్లి ఇల్లంతా తిప్పుతారు. ఆ తరవాతే ఇంటి యజమానీ, కుటుంబ సభ్యులూ, అందరు లోపలికి వెళ్లడం ఆనవాయితీగ వస్తుంది. అలా మొదట గోమాతని ఎందుకు తిప్పుతారు అంటే......

ఈ ఆచారం నిన్న మొన్నటిది కాదు దశాబ్దాలుగా ఆచరిస్తున్నది ఎందుకంటే గోవు సకల దేవతా స్వరూపం. ఆ మాత వెంటే సమస్త దేవతలూ వెంట ఉంటారని శాస్త్రం చెబుతోంది. అందుకే నూతన గృహాల్లో గోమాతను తిప్పడం వల్ల ఆ దేవతలు కూడా మనింట్లో నడయాడుతారు అని, అలానే గోవు మూత్రం, పేడలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం. అందుకే ఇంట్లో గోవును తిప్పినప్పుడు మూత్రం, పేడ వేయడం కూడా శుభసూచకంగా భావిస్తారు. 

శాస్త్రీయంగా చెప్పాలంటే ఆవు మూత్రం, పేడా రెండూ కొత్తింట్లో క్రిములూ(germs) ఇన్ఫెక్షన్లూ (infections) దోమల్నీ దూరం చేస్తాయి. అలానే పేడా మూత్రం, నెయ్యి, పెరుగూ అన్నింటినీ కలిపి పంచగవ్య అంటారు. వీటిని హోమంలో వేసినప్పుడు వెలువడిన (బయటకు వచ్చే) పొగ కూడా క్రిమి కీటకాల్ని బయటకు పంపుతుంది. వాతావరణంలోని విషవ్యర్థాలను  పారదోలుతుంది. మరి అప్పుడే కదా మనం ఇంట్లో ఆరోగ్యంగా ఉండేది. అందుకే గురుముఖం పాలూ గృహప్రవేశం సమయంలో ఆవుకు అంత ప్రాధాన్యం.

Note: ఈ సమాచారం కనుక నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే, share  చేయండి like చేయండి. 

No comments