Home Top Ad

Responsive Ads Here

Why should the temple tower be so high? దేవాలయము గోపురం ఎత్తుగా ఎందుకు ఉండాలి?


దేవాలయము గోపురం ఎత్తుగా ఎందుకు ఉండాలి?



దేవాలయం అంటే లక్షోపలక్షల భక్తుల పుణ్యధామం. ఆగమశాస్త్రబద్ధంగా దేవాలయాలను నిర్మించవల్సి వుంటుంది. ఆలయ నిర్మాణం దేవుడు పడుకున్న శయనరీతిలో నిర్మిస్తారు. ఆలయ గోపురమే భగవంతుని పాదాలు. గర్భగుడి భగవంతుని శిరస్సు. ఆలయ మంటపం భగవంతుని కడుపు. దైవదర్శనం అంటే గుడిలోకి వెళ్ళి స్వామిని చూచి ' గంటకొట్టి నమస్కరించాలి అనుకొంటుంటాం. ఆ పద్ధతినే పాటిస్తుంటాం. కాని దూరంగా ఉండి కూడా ఆలయగోపురానికి నమస్కరించినా స్వామి పాదాలకు నమస్కరించినట్లే అవుతుంది.

కాబట్టి ఆలయగోపురం ఎత్తుగా ఉండాలి
అంతేకాకుండా
దేవాలయం ఒక వ్యక్తికీ ఒక కుటుంబానికి సంబంధించి ఉండదు. సార్వజనిక ఆస్థిగా పరిగణింపబడుతూ, పోషింపబడుతూ, రక్షింపబడుతూ దర్శింపబడుతూ ఉండాలి. దాతలెవరైనా దేవాలయానికి దానాదికాలను చేయవచ్చు. పోషకులుగా వుండవచ్చు. వేశ్యలు కూడా దేవాలయాలను కట్టించిన దాఖలాలు ఎన్నో వున్నాయి. సర్వజనానీకానికీ, పొరుగువూరివారికీ, పరదేశ వాసులకూ, క్రొత్తగా వచ్చినవారికీ దేవాలయం ఎక్కడ వున్నదో సులభంగా తెలుసుకోవటానికి బాగుంటుంది. కాబట్టి ఆలయగోపురం ఎత్తుగా వుండాలి.

దేవాలయ గోపురమే కాదు దేవాలయం కూడా ఎత్తుమీద వుండటం హితదాయకం. అందుకే ఎన్నో దేవాలయాలు కొండలు గుట్టలు చూచుకొని మరీ నిర్మిస్తారు. ఎందుకంటే,  మానవు డెంతటి తెలివికలవాడైనా ప్రకృతిని జయించగల శక్తివంతుడు కాలేదు! కాలేడు! వరదబీభత్సాలు, తుఫానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలకు మనిషి భయపడి తీరవల్సిందే. అటువంటి ప్రకృతి ప్రళయసమయాలలో ప్రాణాలు కాపాడగల్గిన స్థలం దేవాలయమే!

దేవుడు సర్వోన్నతుడు! ఈ సర్వోన్నత భావం దేవాలయాన్ని దర్శించిన ప్రతిసారీ మనిషికి, మనస్సుకీ బోధపడటానికి దేవాలయాన్ని దేవాలయ గోపురాన్ని ఎంత వీలైతే అంతగా ఎత్తుకి నిర్మిస్తారు. హిందూదేవాలయాలేకాదు. మసీదుకి కూడా పొడవైన స్తంభం (మినార్) నిర్మిస్తారు. చర్చికి కూడా ముందుభాగంలో ఎత్తుగా దూరానికి కన్పించే విధంగా అంతస్తు నిర్మించి గంటను కడతారు.

దేవుడు గొప్పవాడు, ఉన్నతమైన వాడు!, అందనివాడు! అందరి వాడు! అని చెప్పటం కోసమే గోపురం చాలా ఎత్తుగా నిర్మిస్తారు.

Note: ఈ సమాచారం కనుక నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే, share  చేయండి like చేయండి.

No comments