Home Top Ad

Responsive Ads Here

What is sapthapadi? Why to walk 7 steps in marriage ?సప్తపది అంటే ఏమిటి? పెళ్లి లో ఏడడుగులు ఎందుకు నడవాలి?


సప్తపది అంటే ఏమిటి? పెళ్లి లో ఏడడుగులు ఎందుకు నడవాలి?సప్తపది అంటే ఏడడగులు కలిసి నడవటం
"సఖాసప్తపదభవ"

ఇద్దరు ఏడడుగులు కలిసివేస్తే మిత్రత్వం కల్గుతుందని శాస్త్రం!!!
పెద్దలు దీన్నే ఏడడగుల సంబంధం అంటారు

వధూవరులు ఏడడుగులు ఎలా నడవాలి? ఏడడుగుల విశిష్టత ఏమిటి?

వరుడు వధువు నడుముపై చేయివేసి దగ్గరగా తీసికొని అగ్నిహోత్రమునకు దక్షిణవైపున నిలబడి తూర్పుదిక్కువైపుగా ఇద్దరూ ముందుగా కుడి అడుగుపెట్టి ఏడడుగులు నడవాలి. ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అర్ధం ఉంటుంది, అది పురోహితుడు వదువరులతో చూపిస్తారు.

మొదటి అడుగు:
"ఏకం ఇషే విష్ణు: త్వా అన్వేతు"
ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరినీ ఒక్కటి చేయుగాక!

రెండవ అడుగు:
"ద్వే ఊర్జే విష్ణు: త్వా అన్వేతు"
ఈ రెండవ అడుగుతో మనిద్దరకు శక్తి లభించునట్లు చేయుగాక!

మూడవ అడుగు:
"త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు"
ఈ మూడవ అడుగు వివాహప్రతసిద్ధికోసం విష్ణువు అనుగ్రహించుగాక!

నాలుగవ అడుగు:

"చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు"
ఈ నాలుగవ అడుగు మనకు ఆనందమును విష్ణువు కల్గించుగాక!

ఐదవ అడుగు:

"పంచ పశుభ్యో విష్ణు: త్వా అన్వేతు"
ఈ ఐదవ అడుగు మనకు పశుసంపదను విష్ణువు కల్గించుగాక!

ఆరవ అడుగు:

"షడృతుభ్యో విష్ణు: త్వా  అన్వేతు"
ఈ ఆరవ అడుగు ఆరు ఋతువులు మనకు సుఖమిచ్చుగాక!

ఏడవ అడుగు:

"సప్తభ్యో హోతాభ్యో విష్ణు: త్వా అన్వేతు"
ఈ ఏడవ అడుగు గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు
అనుగ్రహించుగాక

సప్తపది మంత్రం లో ఉండే అర్థం ఏమిటంటే.....

సఖాసప్తపదాభవ!  సఖాయౌ సప్తపదా బభూవ | సఖ్యంతే గమేయం సత్యాత్| తేమాయోషం సఖ్యాన్మే మాయోష్మాః సమయావః సంప్రియౌ రోచిష్ణూ సుమన సుమానౌ|  ఇష మూర్జం  అభిసంపసానౌ సం నౌమ నాంసి సంవ్రతా సమచిత్తాన్యాకరం"

"ఓ నా అర్ధాంగీ! ఏడడగులతో నీవు నా మిత్రురాలివయ్యావు! నీవు న స్నేహమును వీడకు. నాతో నాకు సహవాసిగావుండిపో. మనం మంచి ప్రేమగలవారంగా ఉందాం. మంచి మనసుతో జీవించుదాం. మనం ఇద్దరము సమచిత్తంతో మెలుగుదాం. సమానమైన ఆలోచనలు కలిగి ఉందాం. నీవు నన్నెన్నటికీ విడువవద్దు' అంటాడు పెళ్ళికొడుకు

సాత్వమసి అమూహం ! అమూహమస్మి| సాత్వం ద్యౌః| అహం పృథివి | త్వంరేతో అహంరేతో భృత్ | త్వంమనో అహమస్మివాక్  సమహమస్మి | ఋక్తం సా మాం అనువ్రతాభవ " అని వరునికి చెబుతుంది వధువు.

ఓ ప్రాణమిత్రుడా! నీవు ఎప్పుడూ ఏ పొరపాటు లేకుండునట్లుగా ఉండు. నేను కూడా ఏ పొరపాటు చేయక నీతో వుంటాను. నీవు ఆకాశమైతే నేను భూమిని! నీవు శుక్రమైతే నేను శోణితాన్ని! నీవు మనస్సైతే  నేను మాటను. నేను సామవేదమైతే నీవు నన్ను అనుసరించే ఋక్కువు! మనిద్దరిలో వ్యత్యాసామ్ లేదు. మనమిద్దరమూ ఒక్కటే. కష్టసుఖాలలో  ఒకరికొకరం తోడు నీడగా కలిసిఉందాం" అని పెండ్లికుమారునికి భరోసా ఇస్తుంది పెండ్లికుమార్తె!

చివరిగా ఇలా అంటాడు వరుడు

"పుం సే పుత్రాయ వేత్తవేశ్రియై ఉత్తరయ వేత్తావయేహి సూనృతే"

ఓ సద్దుణవతీ! మన వంశాభివృద్ధికోసం, మనకు ఉత్తమస్థితి కలుగటం కోసం, మంచి బలముగల, ధైర్యముగల, ప్రజ్ఞావంతులైన వంశహితాన్ని రక్తించగల, న్యాయమార్గం అనుసరించే ఉత్తమ పుత్రులను నాకు ప్రసాదించు" అని సమాదరిస్తాడు వరుడు.

పూర్వీకులు వంశంకోసం, వంశాభివృద్ధికోసం, వంశకీర్తికోసం ఎంతెంతగా పరితపించిపోయారో వివాహ మంత్రాలలో తెలుస్తుంది. భార్యను భర్త ఏ విధంగా ఆదరించాలో, భర్తను భార్య ఏ విధంగా గౌరవించాలో వివాహమంత్రాల్లో చక్కగా ఉంది.

వివాహం పవిత్ర కార్యంగా చెప్పారు మన ఋషులు.

విడాకులు అనేవి హిందూ సంస్కృతిలో లేవు. కష్టసుఖాలను కలబోసి అనుభవిస్తూ జీవించటమే వివాహధర్మం. కలసి ఉన్నపుడు కలతలు సహజం! సర్దుకుపోవటమే జీవితం.

భార్యాభర్తల అనుబంధం మాటల్లో చెప్పలేనిది. వర్ణించి వ్రాయలేనిది. వివరించి విడమర్చి చెప్పలేనిది.
శతమానం భవతి.

Note: ఈ సమాచారం కనుక నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే, share  చేయండి like చేయండి. 

No comments