Home Top Ad

Responsive Ads Here

Why do we have erotic idols on our temples? మన దేవాలయాలమీద బూతు శిల్పాలు ఎందుకు?


మన దేవాలయాలమీద బూతు శిల్పాలు ఎందుకు?శృంగారం దేవాలయం అంటే పవిత్రమైనది గదా! దేవాలయం గాలిగోపురం మీద వివిధ భంగిమల్లో శృంగార శిల్పాలు ఉండటం ఏమిటి? చూసేవారికి అసభ్యంగా ఉండదా? అని మనకందరకూ అనిపిస్తుంది.

దేవాలయాల మీద (గాలిగోపురం మీద) శృంగార శిల్పాలను నిర్మించటం వెనుక ఒక సునిశితమైన ఆలోచన ఉంది. మరొక ప్రయోజనం కూడా ఉంది.

మన పూర్వీకుల జీవితం మన జీవితంలాగ అతివేగంగా (ఫాస్ట్ గా) ఉండేది కాదు. నిశ్చలంగా, నిబ్బరంగా ఉండేవారు. చాలామంది ప్రతిదినమూ దేవాలయానికి వెళ్ళి వస్తుండేవారు. పెద్దవాళ్ళతో పాటుగా యుక్తవయస్సులో వున్నవారు కూడా దేవాలయనికి ప్రతిదినమూ వెళ్ళి రావటం పరిపాటిగా (అలవాటుగా) ఉండేది.

పురుషుడైన ప్రతివాడు “ధర్మ -అర్ధ - కామ - మోక్ష” అనే చతుర్విధ పురుషార్ధాలనూ తప్పక సాధించుకోవాలనే నియమం ఉండేది.

మొదటిదిగా ధర్మసాధన చేయాలి. అంటే చదువుకోవటం గానీ, వృత్తి విద్య నేర్చుకోవటంగాని చేయాలి. రెండవది ధనాన్ని సంపాదించాలి. ధనమంటే ఈనాటి రూపాయినోట్లు కాదు. ఆ కాలంలో ఎవరికైనా ఎన్ని పశువులు వుంటే అంతటి ధనవంతులక్రింద లెక్క! మూడవది వివాహం చేసుకొని ఎక్కువమంది పిల్లల్ని కనాలి. ఎంతమంది సంతానం ఉంటే అంత గొప్పన్న మాట! నాల్గవది చివరిగా మోక్షమార్గం అనుసరించి జీవితం ముగించాలి. ఈ నాల్గింటిని పుణ్యపురుషార్థాలు అంటారు. మనిషికి ఈ నాలుగు పురుషార్థాలూ అవసరమే. “కామిగాక మోక్ష కామిగాడు” అంటాడు వేమన. మనం తెలుసు కోవల్సిన విషయం ఇంకొకటి కూడా ఉంది.

శృంగారం పాపకార్యం కాదు. సృష్టికి మూలం శృంగారమే గదా! అంతేకాదు; భార్యలతో కలసివున్న దేవుళ్ళనే పూజిస్తుంటాం. మనం చదివే మంత్ర శ్లోకాలలో కూడా శృంగారం వుంది గదా!

ధర్మం ఎంత గొప్పదో శృంగారమూ అంతే!
సంపాదన ఎంత ముఖ్యమైనదో శృంగారమూ అంతే!
మోక్షమెంతటి గొప్పదో శృంగారమూ అంతే!

వశిష్ఠాది మహా బ్రహ్మర్షులకు కూడా భార్యాబిడ్డలు ఉన్నారన్న విషయం విస్మరించ కూడదు. భార్యతో కూడిన సృష్టి కార్యం పవిత్ర ధర్మంగా గుర్తించాలి. కాని పరస్త్రీ వ్యామోహం మాత్రమే మహాపాపం.

పూర్వకాలంలో 'సంతానమే సంపత్తు'గా ఉండేది. ఎక్కువ సంతానం వున్నవారికి సమాజంలో ఎక్కువ గౌరవం ఉండేది. ఎక్కువ సంతానం వున్న వారికి శత్రువులు భయపడేవారు. ఆనాడు వ్యవసాయమే అందరికీ ప్రధాన వృత్తి. ఎక్కువ ధాన్యాన్ని పండించాలంటే ఎక్కువ కృషి చేయాలి ఎక్కువ కృషి చేయాలంటే ఎక్కుమంది బిడ్డలు కావల్సి వచ్చేది. కాబట్టి 'సెక్స్' ఆనాటి ప్రజల జీవనానికి ముఖ్యచేతనం చేయాలి కాబట్టి గుడి గోపురాల మీద బూతుబొమ్మలు సృష్టించాల్సిన అవసరం కల్గివుంటుంది.

ఈనాడు మనం సుఖాన్ని రకరకాలుగా అనుభవిస్తున్నాం. సినిమాలు, టివి, కార్లు, ఎ.సి.రూములు, హోటల్, బార్లు ఇలాంటివెన్నో మనకు సుఖాన్ని కల్గిస్తున్నాయి. ఆనాటి వారికి ఇవేమీ లేవు. వారికి సుఖాన్ని కల్గించేవి మూడే మూడున్నాయి. ఆహారం, నిద్ర, శృంగారం. ఈ మూడే వారికి ప్రధానాంశాలు! కాబట్టి శృంగారం ఆనాటి జనజీవితాలకు ప్రధానాంశంగా భావించారేమో!

దేవాలయాలే ప్రజలకు వినోదకేంద్రంగానూ, విలాస కేంద్రంగానూ ఉండేవి. ఊరివారందరికీ దేవాలయం ఉమ్మడి ఆస్థిగావుండేది. దేవుని ఉత్సవాలు, జాతరలు, తిరునాళ్లు మాత్రమే ఆనాటివారికి వున్న ఉమ్మడి వినోదం. ఊరివారందరు ఒకే చోట కలుసుకొని ఆత్మీయతలు పంచుకొనేవారు. ఇంతకు మించిన వినోదవిహారాలు వాళ్ళకేమీ ఉండేవి కాదు. కష్టించి పనిచేయడం వారికి తెల్సిన విద్య. కడుపునిండా దొరికింది తినటమే వారికి తెలిసిన తృప్తి. ఒక్కొక్క ఇంటిలో వందలమంది సభ్యులు ఉండేవారు. ఈ కారణంగా వారిలోవున్న లైంగిక ఆసక్తి అణగిపోతూవుండేది. చాలామంది యువకులు దేవాలయాలలోనే విశ్రాంతి పొందుతుండేవారు. రాత్రిళ్ళుకూడా అక్కడే నిద్రపోతుండేవారు. యువతను నిద్రాణం కాకుండా చూడటానికీ, శృంగార మనోవృత్తిని మేల్కొలుపటానికీ దేవాలయాలమీద బూతు బొమ్మలను నిర్మించేవారు.

ప్రతినిత్యం దేవాలయానికి వెళుతూ దైవధ్యానంలో పది సృష్టి కార్యాన్ని విస్మరించకూడదన్న హెచ్చరిక చేయడానికే దేవాలయాలమీద శృంగార శిల్పాలను నిర్మించారు మన పూర్వికులు.

అంతేకాదు;
శృంగారం పాపవృత్తికాదనీ పవిత్రమైనదనీ దీని ఉద్దేశ్యం.
శివలింగం కూడా శృంగార సంకేతమే గదా!

ఆనాటి లైంగిక బంధాలు సంతానోత్పత్తికోసమే ఉండేవి. ఈనాటిలో భోగప్రవృత్తిగా ఉండేవికాదు. అంతేకాదు ప్రతి పున్నమిరాత్రికీ “కంచు కోత్సవాలు" జరిగేవి. భర్త కారణంగా పిల్లలు లేని (కలుగని) స్త్రీలందరూ పున్నమిరాత్రులలో అపరిచిత పురుషులతో సంసారం చేసి పుత్రవతులు అయ్యే సంప్రదాయం ఆనాటి ధర్మంగా ఉండేది.  తన భార్యకు పరపురుషుని వల్ల కలిగిన కొడుకుని క్షేత్రజుడు అంటారు. క్షేత్రజుడు కూడా పుత్రునితో సమాన మైనవాడే! కుంతీదేవి ఈ నియోగ పద్ధతిలోనే పాండవులను కన్నది. పాండు రాజుకి నియోగపద్ధతిలో జన్మించినవారే ధర్మ - భీమార్జునులు.
ధర్మం కాలానుగతంగా మార్పు చెందుతుంది.

Note: ఈ సమాచారం కనుక నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే, share  చేయండి like చేయండి.

No comments