Home Top Ad

Responsive Ads Here

Why to apply Kumkuma on the fore head? కుంకుమ'ను ఎందుకు ధరించాలి?


కుంకుమ'ను ఎందుకు ధరించాలి?



కుంకుమ ధరించటం అనేది కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించినది కాదు. స్త్రీ పురుషులిద్దరికీ సంబంధించినది.

కుంకుమ పెట్టుకోవటం హిందూ సంప్రదాయం! అన్ని కులాల హిందువులు, శైవ వైష్ణవ మతస్థులు అందరూ నొసటన కుంకుమ ధరించటం గొప్పదనంగా భావిస్తారు.

కుంకుమ ఆస్తికత చిహ్నం!

ఐదారు వందల సంవత్సరాల క్రితం వరకూ హిందూ మతస్థులందరూ తప్పనిసరిగా కుంకుమను నొసట దిద్దుకొనే ఆచారం బలీయంగా ఉండేది. ఆచారంగా మాత్రమే కాకుండా అలంకారంగా కూడా ఉండేది. హరిచందనాన్ని మంచి గంధాన్ని, విభూతిని కూడా నొసట ధరించటం హిందూ సంప్రదాయంగా పాటిస్తూ వచ్చారు మన పూర్వీకులు.

రెండు కనుబొమ్మలకు మధ్య భాగంలో నుదుటివద్ద 'ఇడ"పింగళ'నాడులు కలిసి 'సుషుమ్న'నాడిగా పరివర్తన చెందే స్థలం వద్ద కుంకుమను దిద్దుకొంటాం. ఈ కుంకుమ
వల్ల మనిషికి దృష్టిదోషం తగుల కుండా వుంటుందని కూడా ఒక నమ్మకం ఉంది.
మరొకటేమిటంటే కుంకుమ ధరించే వ్యక్తికి ఎదుటివారు మానసికంగా లొంగి పోతారన్న వాదన కూడా ఉంది. ఎర్రని ఎరుపు రంగు మనిషికి మనోశక్తిని, త్యాగ తత్వాన్ని, నిర్భయత్వాని  పరోపకారగుణాన్నీ కల్గిస్తాయన్న 'థియరీ' కూడా వుంది.

కుంకుమ ధరించటం పవిత్రతకు, ఆస్తికత్వానికి ధార్మికత్వానికి పురుషూలకు సంకేతమైతే, స్త్రీలకు ఐదవ తనానికీ, సౌభాగ్యానికీ, స్థిరబుద్ధికీ సంకేతంగా చెప్పవచ్చు. మానవుడు నాగరికత నేర్చినదగ్గరనుండీ కుంకుమను ముఖ్య అలంకారంగా కూడా భావించినట్లు కొన్ని గ్రంథాలలో ఉంది.

సృష్టిలో మొదటిరంగు ఎరుపురంగేనన్న ఒక వాదం ఉంది. ఎరుపురంగు లక్ష్మీప్రదమని కూడా అంటారు. శక్తి దేవతలకు ఎరుపు రంగు వస్త్రాలనే ధరింప జేయటం గమనార్హం

భర్తను కోల్పోయిన స్త్రీలు పరులెవ్వరికీ అందంగా తాము కన్పించకూడదు అన్న వుద్దేశ్యంతోనే కుంకుమ ధారణను త్యజిస్తారు. కుంకుమ భారతీయతకు చెరుగని ముద్ర. పాశ్చాత్య నాగరికత మనమీదకు దాడిచేసిన తరువాత పురుషులందరూ కుంకుమధారణ మరిచిపోయారు. ఇంకొంతకాలానికి స్త్రీలు కూడా మరచిపోవచ్చునేమో! దేవుళ్ళు మాత్రమే మిగుల్చుకుంటారేమో!

కాలం తెచ్చే మార్పులు వింతగా ఉంటాయి. మరల మన భారతీయత చాటిచెప్పే ఆచారాలు తిరిగి వస్తాయి అని నమ్ముదాం.

Note: ఈ సమాచారం కనుక నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే, share  చేయండి like చేయండి.




No comments