Home Top Ad

Responsive Ads Here

Do not worship without bathing? స్నానం చేయకుండా పూజ చేయకూడదా?


స్నానం చేయకుండా పూజ చేయకూడదా? 



శరీర మాలిన్యాలను తొలగించేది స్నానం. స్నానమనేది శుచి శుభ్రతలకు సంకేతమే గాని పవిత్ర కార్యం కాదు. పూజ చేయటానికి స్నానం చేయటానికి సంబంధం లేదు. కాని; స్నానం చేసిన తరువాతనే పూజ చేయటంలో ఒక అంతరార్థం వుందని చెప్పవచ్చు! మామూలు స్నానం కానీ, శిరస్నానంకానీ, అభ్యంగన స్నానం కానీ చేసిన తరువాత శరీర మాలిన్యాలన్నీ తొలగింపబడి మనసు ప్రశాంతంగా వుంటుంది.

“ఆత్మశుద్ధిలేని ఆచారమదియేల
భాండశుద్ధిలేని పాకమేల
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా"
అన్నాడు యోగి వేమన దేవుడు కానుకలకు. దొంగపూజలకు లొంగడు.  ఒకవేళ లొంగితే వాడు దేవుడే కాదు. అటువంటి లోంగే దేవుడ్ని పూజించనక్కర్లేదు కూడ!

దైవపూజకు కావల్సింది అలంకరించుకొన్న దేహం కాదు! అంకితభావంగల మనస్సు కావాలి. పరమాత్ముని పూజకు ముఖ్యమైంది మనస్సు. దేవుడు ఆడంబర పూజలను అంగీకరించడు.  భగవద్గీతలో గీతాచార్యుడు కూడా ఇదే విషయం చెబుతాడు. దేవుడ్ని హృదయ కమలంతో పూజించాలేగాని, డాబుదర్పాలతోనూ, ధూపదీపాలతోనూ, నేతి ప్రసాదాలతోనూ కాదు.

వైదికమతం భారతదేశంలో పుట్టి మూడు వేల సంవత్సరాలకు పైగా అయింది. పండితులైన వైదిక గురువులు హిందువులను, కోతులను ఆడించినట్లుగా ఆడించారు. చిత్రవిచిత్ర ఆచారాలను పుట్టించి హైందవ మతాన్ని నాశనంవైపుగా నడిపించారు. వృత్తి ప్రాదిపదికగా ఏర్పడ్డ వర్ణా శ్రమధర్మం క్రమ క్రమంగా వెర్రితలలు వేసింది. ఫలితంగా కులాలు పుట్టాయి. మనకు కులాలు పుట్టి దాదాపుగా రెండున్నరవేల సంవత్సరాలు అయింది. హిందూమతంలో ఎపుడైతే కులవ్యవస్థ వచ్చిందో అప్పుడే మతపతనం ప్రారంభం అయింది. హిందువుల ఐక్యత పోయింది. అన్నదమ్ములుగా జీవించవల్సిన హిందువు లందరూ కులాల చిచ్చుతో కొట్టుకోవటం మొదలయింది. హిందువులు మూడు వేల కులాలుగా విడిపోయారు. అర్ధం పర్ధంలేని ఆచారాలు పుట్టాయి. వేలకువేలుగా దేవుళ్ళు సృష్టింపబడ్డారు.

వేదాలను, వేదసంప్రదాయాలను మరచిపోయాం. చిల్లర దేవుళ్ళకు పూజచేస్తున్నాం.
పిచ్చిపిచ్చి ఆచారాలను పాటిస్తున్నాం. ఎప్పుడైనా విచారవంతమైన ఆచారమే సదాచారం.

Note: ఈ సమాచారం కనుక మీకు నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే,  like చేయండి, share  చేయండి.

No comments