Home Top Ad

Responsive Ads Here

Is it better to bury or fire the CORONA corpse ? కరోనా శవాన్ని పూడ్చటం మంచిదా? కాల్చటం మంచిదా?


కరోనా శవాన్ని పూడ్చటం మంచిదా? కాల్చటం మంచిదా?


కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారికి, కాల్చటమే ఉత్తమం అంటున్నారు వైద్యులు, ఎందుకంటే ఏ వైరస్ కూడా అంత వేడికి తట్టుకుని బతికి బట్టకట్టదు. ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడాలంటే కాల్చటమే మంచిది అంటున్నారు. కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారికి చేయవలిసిన కార్యక్రమం లో  పాటించాల్సిన విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం ఇదివరకే జారీచేసింది. తగు జాగ్రత్తలు తీసుకుని ఈ కరోనా వైరస్ మహమ్మారి ని అడ్డుకట్టవేయాలని ప్రభుత్వం ప్రజలందరికీ పిలుపునిచ్చింది.

ఆర్యులు శవాన్ని కాలుస్తారు. వీరందరూ వైష్ణవ మతస్థులు! ద్రావిడులు శవాన్ని భూస్థాపితం చేస్తారు. వీరందరూ శైవమతస్థులు! అయితే శైవులు వైష్ణవులకు స్మశానం మాత్రం ఒకటే.

క్రైస్తవ మతస్థులు కూడా భూస్థాపితం చేస్తారు. ముస్లిం మతస్థులు కూడా భూస్థాపితం చేస్తారు.

శవదహనం ఖర్చుతో కూడుకొన్నది. శ్రీమంతులకు మాత్రమే ఇది చెల్లుబాటు. భూస్థాపితానికి అంతగా ఖర్చుకాదు. కాని స్థలం సమస్య వుంటుంది అందరూ ఇటుకలతో సమాధులు కడితే సమస్యే గదా మరి! ఇటుకలతో సమాధి నిర్మించకపోయినా జ్ఞాపకంగా గుర్తుకోసం ఒక రాయిని పాతి వేస్తుంటారు. సంవత్సరానికొకసారి వెళ్ళి పూజ చేసి వస్తుంటారు. దహనం చేసినవారు దహనానంతరం అస్తికలను భద్రం చేసి పవిత్రనదుల్లో కలుపుతారు. ఈ విధంగా చేయటంవల్ల మరణించిన వారికి సద్గతులు లభిస్తాయని విశ్వాసం. నదీ నిమజ్జనాన్ని వేదధర్మం అంగీకరించదు.

వైష్ణవులు ఎందుకు శవదహనం చేస్తారంటే?

ఈ శరీరం పాంచభౌతికమైనది. "పృధివి అప్ తేజోవాయు రాకాశ నిర్మితం యత్ తత్   పాంచభౌతికం" భూమి - నీరు - అగ్ని - గాలి -ఆకాశమనే ఐదింటితో ఈ శరీరం నిర్మితమౌతుంది. అని వైష్ణవుల నమ్మకం. కాబట్టి మరణించిన తరువాత అగ్నిసంస్కారం చేస్తే భూమి భూమిలో, అగ్ని అగ్నిలో, గాలి గాలిలో కలిసిపోయి జీవునికి ముక్తి లభిస్తుందని వైష్ణవుల విశ్వాసం. దాదాపుగా ఆర్యులలో వైష్ణవులే చాలామంది!

శైవులందరూ భూస్థాపితం ఎందుకు చేస్తారంటే - పుట్టటమనేది ఏది వున్నా అది భూమి నుండే పుడుతుంది. శూన్యం నుండి కాదు. ఆహారం భూమినుండే లభిస్తుంది. ఆహారపోషణవల్లనే శరీరం నిలబడుతుంది. ఆహార పోషణవల్లనే శుక్రశోణితాల వుత్పత్తి జరుగుతూవుంది. శుక్ర - శోణితాల కలయికవల్లనే శిశువు జన్మిస్తుంది. భూమియే మనకు అన్నిటినీ ఇస్తున్నది గాబట్టి, మనిషి మరణించిన తరువాత భూస్థాపితం చేయటం ధర్మసమ్మత మంటారు శైవమతస్థులు! దాదాపుగా వీరందరూ ద్రావిడులు. వేల సంవత్సరాల క్రితం ఆర్యులకు ద్రావిడులకు యుద్ధాలు జరుగుతూ వుండేవి. వారికి వీరికి వింధ్యపర్వతమే సరిహద్దుగా వుండేది.

కాల్చటం మంచిదా! పూడ్చటం మంచిదా! అంటే ఏం చెప్పాలి. ఎవరి విశ్వాసం వారిది. ఎవరి ఆచారం వారిది. తరతరాల సంప్రదాయాలను మార్చటమంటే మాటలు కాదు. అయితే ఒక్క విషయం గుర్తించితే మంచిది. దీర్ఘ రోగాలతో (ఎయిడ్ మొదలైనవాటితో) మరణించిన వారిని దహనం చేయటమే మంచిది అంటున్నారు చాలామంది వైద్యనిపుణులు.

Note: ఈ సమాచారం కనుక మీకు నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే,  like చేయండి, share  చేయండి.

No comments