Home Top Ad

Responsive Ads Here

Is it compulsory to do parents Karma's'? మాతాపితృకర్మలు తప్పనిసరిగా చేయాలా?


మాతాపితృకర్మలు తప్పనిసరిగా చేయాలా?


“మాతృదేవో భవ !
పితృదేవోభవ !
ఆచార్యదేవోభవ!
అతిథి దేవో భవ !" - అని చెబుతున్నది. ఆర్యవాణి

జన్మనిచ్చి, పోషించి, పెంచి, తప్పటడుగులు దగ్గరనుండి తప్పు అడుగుల వరకు సరిదిద్ది, పెద్దజేసి, విద్యాబుద్ధులు నేర్పించి, మనల్ని మనుషులుగా సమాజంలో నిలబెట్టిన తల్లిదండ్రులు మరణించిన తరువాత శ్రాద్ధ కర్మలు తప్పనిసరిగా చేయాలా అంటే ఏం చెప్పాలి?

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలవారు ప్రతి సంవత్సరమూ తిథుల ప్రకారం సంవత్సరీకాలు పెడుతుంటారు. శూద్ర వర్ణం వారందరూ ఎక్కువగా సంక్రాంతికి పెద్దలను స్మరించుకొని బట్టలు పెడుతుంటారు. పెద్దల పేరుమీద దానధర్మాలు చేస్తుంటారు. ఇది మన సంప్రదాయం. సంక్రాంతికే పెద్దలను స్మరించుకొని పూజించుకోవటమెందుకంటే, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేది పుష్య మాసంలో కాబట్టి! ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ఇపుడే ప్రారంభమౌతుంది. గనుక ఇపుడే స్వర్గద్వారాలు తెరుస్తారనీ, ఈ పుణ్యకాలంలో మరణించినవారికి స్వర్గప్రాప్తి కల్గుతుందని, హిందువుల విశ్వాసం. స్వర్గ ద్వారాలు తెరిచే సమయం లోనే సంక్రాంతి వస్తుంది. కాబట్టి భోగినాడు పితృదేవతలను పూజించే సంప్రదాయం వచ్చింది.

అసలు పుత్రుడు అంటే అర్ధం ఏమిటో తెలుసా!

"పున్నామ నరకాత్ త్రాయతే ఇతి పుత్రః" పున్నామ నరకం నుండి రక్షించు వాడు పుత్రుడు అని అర్థం. పున్నామ నరకంనుండి రక్షింపబడితేనే స్వర్గం లభిస్తుంది.

చాలామంది కొడుకు కావాలని ఎందుకు కోరుకొంటారో తెల్సా! ఆడపిల్ల అయితే పెండ్లికాగానే ఇల్లు విడిచి పరాయి చోటికి వెళ్ళిపోతుంది. కొడుకు అయితే మనదగ్గర వుంటాడు; ముసలితనంలో ఆదరిస్తాడు; మన వంశం పేరు (ఇంటి పేరు) నిలుపుతాడు. చచ్చిన తరువాత కర్మకాండల పుణ్యకార్యాలు చేస్తాడు అని ఆశపడతారందరూ.

"తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమివాడు గిట్టనేమి" - అన్నాడు వేమన

మనకు జన్మనిచ్చిన వారిని సంవత్సరానికొకసారైనా తలచుకోవాటం కొడుకుల బాధ్యత కాదా! అలా తలచుకోవటం పుణ్యప్రదం కాదా!

తల్లిదండ్రులు సంపాదించుకొన్న ఆస్థిపాస్తుల్లో భాగం కావాలి. పుణ్య కార్యాల్లో భాగంవద్దా? తండ్రుల ఆస్తులకోసం కోర్టుకెక్కిన కొడుకు లెందరో వున్నారు. కొడుకు అన్నం పెట్టటం లేదని కోర్టుకెక్కిన తండ్రిని ఎక్కడైనా చూచారా!

Note: ఈ సమాచారం కనుక మీకు నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే,  like చేయండి, share  చేయండి.

No comments