Home Top Ad

Responsive Ads Here

Is it good to see omens? శకునాలు చూడటం మంచిదేనా?


 శకునాలు చూడటం మంచిదేనా?


మనిషికి జరుగబోయే శుభాశుభాలను దేవుడు ముందుగానే తెలియ పరుస్తుంటాడని హిందువుల హిందువుల విశ్వాసం. అందువల్లనే చాలామంది శకునాలు చూస్తుంటారు. రాహుకాలం. రాహుకాలం చూచుకొని పనులు ప్రారంభిస్తుంటారు.

అయితే;
నకతం రాహుకాలం చూచుకొని మనం జన్మించం! ముహూర్తం చూచుకొని మరణించం! మనిషికి ఆత్మబలం సన్నగిల్లినపుడే ఇవన్నీ దగ్గర చేరతాయి. అంతే తప్ప శకునాలు చూడటం మంచిదికాదు.

మన బస్సులు, రైళ్ళు, విమానాలు శకునాలు చూచుకొని బయలుదేరవు. విధిమీద నమ్మకంలేనివాళ్ళే శకునాలు చూస్తారు. దేవుని గుడ్డిగా నమ్మిన వాళ్ళే మూఢాచారాలు పాటిస్తారు.

మనిషి తనలోని లోపాలను కప్పిపుచ్చుకోవటానికి, తన తప్పులను దాచుకోవటానికీ శకునాలను అడ్డుపెట్టుకోజూస్తున్నాడు. అంతే! అంతకుమించి మరేమీలేదు.

మనం కర్మసిద్ధాంతాన్ని నమ్మినంత తేలిగ్గా కృషి సిద్ధాంతాన్ని నమ్మం! పూర్వ ఋషులు ఎవరూ శకునశాస్త్రాలు వ్రాయలేదు. మనలను సదా నడిపించే శక్తి ఒకటి వుందని నమ్మినపుడు, తల్లిగర్భంలో వున్నపుడే మన తలవ్రాత వ్రాయబడిందని అనుకొంటున్నపుడు ఈ శకునాలతోనూ దుర్ముహూర్తాలతోనూ పనేముంది! జయాపజయాలు సుఖదుఃఖాలు మనుషులకు సహజమే కదా!  దేవుడైనా, దెయ్యమైనా నమ్మ గల్గినవారికే!

ప్రశాంతంగా కూర్చుని పంచాగాలు చూచుకొనే రోజులు పోయాయి. ప్రతిపనిలోనూ పోటీతత్వం వచ్చేసింది. గెలవగల్గిన గుర్రానికి గుగ్గిళ్ళు పెడుతున్నారందరూ. ఇది లోకం విషయంలోనే కాదు. కుటుంబంలో కూడా ఇప్పుడిలాగే వుంది. ఇంట్లో ఎవరిమాట చెల్లుబాటు అవుతుంటుందో కుటుంబ సభ్యులందరూ వారికే వంతపాడుతుండటం మనం చూస్తూనే వున్నాం కాలంకన్నా ముందుగా పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో శకునాలు చూచేవారి సంఖ్యా తగ్గిపోయింది. ఇపుడు డబ్బును చూస్తున్నారేగాని శకునాలు కాదు. లాభాలు చూచుకొంటున్నారేగాని రాహుకాలాలు చూడటం లేదెవ్వరూ.

కాలం మారుతూవుంది. మనమూ మారకపోతే ఎగతాళి చేస్తారు అందరూ!

 చిత్తశుద్ధి, సంకల్పబలం, ఆత్మవిశ్వాసం వున్నవారిని ఏ శకునాలు ఏమీ చేయవు.  దుర్ముహూర్తాలు, రాహుకాలాలు ఏమీ చేయలేవు. ఆత్మబలంతో అన్నిటినీ ఛేదించవచ్చు.

Note: ఈ సమాచారం కనుక మీకు నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే,  like చేయండి, share  చేయండి.

No comments