Home Top Ad

Responsive Ads Here

Why Mantras will be only in Sanskrit? మంత్రాలు సంస్కృత భాషలోనే ఎందుకు ఉంటాయి?

మంత్రాలు సంస్కృత భాషలోనే ఎందుకు ఉంటాయి?



వేదాలు 'అపౌరుషేయాలు' అంటారు. అపౌరుషేయాలు అంటే ఏ పురుషుడూ వ్రాయనివి అని అర్ధం. వేదాలను సంస్కృతంలో వ్రాశారు అంటే వేదాలు పుట్టినపుడు తెలుగుభాష పుట్టలేదు. అంతెందుకు వేయి సంవత్సరాల క్రితం అంటే పదకొండవ శతాబ్దం వరకు తెలుగు భాషకు వ్యాకరణమే పుట్టలేదు.

వేయి సంవత్సరాల క్రితం ఆంధ్రదేశంలో ప్రాకృతభాష మాట్లాడేవారు. ఆంధ్రులు నాగజాతివారనే వాదం కూడా ఒకటుంది. కర్ణాటకదేశంవాడైన నన్నయభట్టు మొట్టమొదటగా “ఆంధ్రశబ్దానుశాసనమ్” అనే వ్యాకరణం వ్రాసేవరకు తెలుగుభాషకు ఒక రూపం లేదు. అలాంటపుడు మంత్రాలు తెలుగులో ఎలా వుంటాయి? లక్షోప లక్షల సంవత్సరాల చరిత్ర మన వేదాలది! తెలుగులో వుండటానికెలా సాధ్యం ?

వేదానికి ఒక నాదం వుంది. వేదానికి ఒక స్వరం వుంది. వేదానికి ఒక ఛందస్సు వుంది స్వరయుక్తంగా వేదం చదువుతూ వుంటే ఎంత మధురంగా వుంటుంది! ఎంత హాయిగా వుంటుంది!! ఎంతటి అనిర్వచనీయమైన ఆనందం కల్గుతుంది!!

పవిత్ర ఖురానుగ్రంధం అరబ్బీక్ భాషలో ఉంది. ఆ భాషను ముస్లిం మతస్థులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. భౌద్ధమతం పాళీభాషలో ఉంది. భౌద్దులు పాళీభాషను దైవసమానంగా చూస్తారు. క్రైస్తవమత బోధకులు మనదేశంలో బోధనలు చేసినా ఇంగ్లీషు భాషలోనే బోధనలు చేస్తారు. ఏ మతంవారు ఆ మత భాషను గౌరవిస్తారు. ప్రేమిస్తారు. పూజిస్తారు. మనంతప్ప!

కొంతమంది స్వప్రయోజకులు, మంత్రాలనే జీవనాధారంగా చేసుకొని, ఆచరణలు మాత్రమే మిగుల్చుకొన్న మూర్ఖులు, అగ్రవర్ణమని చెప్పుకొనే ఛాందసులు, వేదాలకూ, వేదమంత్రాలకూ తీరని ఆరని అపచారం అపకారం చేశారు! చేస్తున్నారు! వేదాలు ఎవరికీ తెలియకుండా చేశారు. ఎవరూ చదవకుండా చేశారు. వేదం అంటే పెళ్ళిళ్ళకూ, శ్రాద్ధాలకూ, పూజలకూ చదివే శ్లోకాలు కాదు. మానవునికి దిశానిర్దేశం చేసేది వేదం! వేదం ఒక కులానికి, ఒక మతానికి, ఒక భాషకు చెందినది కాదు. శూద్రులు వేదం చదవకూడదని ఏ వేదమూ చెప్పలేదు. బ్రాహ్మణులు ఈ విషయంలో మానవాళికి అన్యాయమే చేశారు.

భారతీయ భాషలన్నిటికీ సంస్కృతమే మూలం. సంస్కృతం నుండే భారతీయ భాషలన్నీ పుట్టాయి. కానీ మనమిప్పుడు సంస్కృత భాషను మృతభాష (చచ్చి పోయిన భాష) అంటున్నాం. ఇంకొంత కాలానికి భారతీయ భాషలన్నీ మృత భాషలై పోయే రోజు రాబోతూ వుంది. ఇంగ్లీషు భాష భారతీయ భాషలను మ్రింగి వేయబోతు వుంది. అపుడు మన దేవాలయా లన్నీ 'చర్చి'లుగా మారినా ఆశ్చర్య పడనక్కరలేదు.

Note: ఈ సమాచారం కనుక మీకు నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే,  like చేయండి, share  చేయండి.

No comments