Home Top Ad

Responsive Ads Here

Why to celebrate Sankranthi Festival? సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకొంటారు ?


సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకొంటారు? 


మన పండుగలన్నీ గ్రామీణ కర్షక కార్మికులకోసం సృష్టింపబడ్డాయి. సంవత్సరాంతం పంట పొలాల్లోనూ పశుపోషణతోనూ సతమతమౌతు శారీరకంగా నలిగిపోయే కర్షకవర్గం కోసమే ముఖ్యంగా ఈ పండుగలను నిర్దేశించారు మన పూర్వీకులు.

వడ్రంగి - కమ్మరి - కుమ్మరి - సాలె - మొదలైన వారందరికీ అమావాస్య పున్నమి దినాలు సేలవుదినాలుగా వుండేవి. అన్నదాతలై పంటలు పండించే కర్షకులకు ప్రత్యేకంగా
సేలవుదినాలు వుండేవికాదు. ఆనందంగా గడిపే తీరిక వుండేది కాదు. కాబట్టే కర్షకవర్గాన్ని దృష్టిలో వుంచుకొని పొలాలలో పని వుండని సమయంలో పండుగలు వచ్చేటట్లుగా చేశారు. ఈనాడు మనం చూస్తున్నట్లుగా కాలువలు వుండేవికాదు. కాలువల ద్వారా నీరు నడిపించుకోని వ్యవసాయం చేయటం ఆనాటివారికి తెలియదు. కేవలం వర్షాధారంగా పంటలు పండించుకొనేవారు. ఆరేడువందల సంవత్సరాల నుండే మనకు కాలువల ద్వారా నీరు నడిపించి వ్యవసాయం చేయటం మొదలైంది. అంతకు ముందు భావులు తీసి ఏతంవేసి వ్యవసాయం చేసే పద్ధతి వుండేది. చెరువులలో నీటిని నిల్వచేసి వ్యవసాయం చేసే పద్ధతి కూడా వుండేది.

ముఖ్యమైన పండుగలు వ్యవసాయ క్షేత్రాల్లో పనివుండే కాలాల్లో రావు సంక్రాంతి మనకు ముఖ్యమైన పండుగ. ఒకరకంగా ఈ పండుగ వ్యవసాయదారుల పండుగ. రైతుల యింటినిండా ధాన్యలక్ష్మి కళకళలాడుతూ ఉండేది  ఇప్పుడే! పశువులు మేతమేసి చక్కగా పాలను యిచ్చేది కూడా ఇప్పుడే. మనమిపుడు ధనం అంటే కరెన్సీ కట్టలే' అనుకొంటున్నాం. 17వ శతాబ్దంనుండి మాత్రమే రూపాయి నాణేలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు వస్తుమార్చిడి పద్ధతివుండేది. వస్తుమార్పిడి పద్ధతి అంటే మనదగ్గర వున్న ధాన్యాన్ని ఇచ్చి మనకు కావల్సిన ధాన్యాన్నిగానీ వస్తువులను గానీ తీసుకోవటాన్ని వస్తుమార్చిడి పద్ధతి అంటారు.

1757లో భారతదేశంలో నాణేలు వచ్చాయి. మెల్లమెల్లగా వస్తుమార్పిడి ఆగిపోయింది. 1862లో మనదేశంలో కాగితపు కరెన్సీ ప్రారంభం అయింది.

మన పండుగలన్నింటిలోకి సంక్రాంతికి ఒక ప్రత్యేకత వుంది. ఈ పండుగ తెలుగువారి పండుగ. రైతుబాంధవులందరూ పేదసాదలకు తప్పకుండా విరివిగా ధాన్యాన్ని దానాలు చేసేవారు. ఎంత చిన్న రైతు అయినా కనీసంగా రెండు బస్తాల ధాన్యం దానం చేయటం ఉండేది. అఆలు దిద్దించే అయ్యవారి దగ్గరనుండి మంగలి, చాకలి, వడ్రంగి, కమ్మరి, మాదిగ, దాసరి మొదలైన వారికందరికి సంవత్సర జీతంగా ధాన్యాలు ఇచ్చేవారు. ఎంత నిరుపేద యినా ఈ పండుగకు క్రొత్త బట్టలు వేసుకొని పరమాన్నాలు తినేవారు. అందరి కళ్ళలోనూ ఆనందం పొంగువారేది ఈ పండుగకే!

నెలరోజులు జరుపుకొనే పండుగ యిది.

హరిదాసుల సంకీర్తనలతో, రకరకాల రంగురంగుల రంగవల్లికలతో, గంగిరెద్దుల వూరేగింపులతో, నోరూరించే పిండివంటలతో, పడుచుపిల్లల గొబ్బెమ్మల పాటలతో హాయినిచ్చే పండుగ ఈ సంక్రాంతి. అలాగే 'విజయదశమి' కూడ.

తొమ్మిది రోజులు జరిగే విజయదశమి వుత్సవం శక్తి సంకేతం. ధనం మాత్రమే మనిషికి సుఖాన్ని ఇవ్వలేదు; విద్య వుండాలి! విద్య మాత్రమే మనిషిని రక్షించలేదు; శక్తి వుండాలి! శక్తిలేని విద్య, సంపదలు వ్యర్ధంగదా! అందుకే "తిండిగలిగితె కండ కలదోయ్, కండగలవాడేను మనిషోయ్" అని గురజా వారు అన్నారు. శారీరిక బలంవుంటేనే సుఖాలను అనుభవించగలం. సుఖాలను అనుభవించలేనపుడు ధనం వుండి ప్రయోజన మేముంటుంది. తొమ్మిది రోజులు జరిగే ఈ  దేవీ నవరాత్రులలో మనిషికి విజ్ఞానంతో పాటు వినోదాన్ని పంచి ఇచ్చి పురాణాలు, హరికథలు, నాటకాలు, బొమ్మలాటలు ఎన్నెన్నో వుంటాయి.

ఇదే విధంగానే అన్ని పండుగలు కూడ!

జీవితంలో కష్టాలు, సుఖాలు సహజమని చెబుతూ వేపపువ్వులో బెలం వేసుకొని తినే ఉగాది పండుగ! హిందువులందరూ ఐక్యంగా వుండాలని హిందూమతస్తూలందరూ (శైవులు - వైష్ణవులు) కలసి చేసుకొనే గణపతి పండుగ! కొత్తకొత్తగా వర్షాలకు పుట్టివచ్చే క్రిమికీటకాలను గంధకం పొగలతో నాశనం చేసే దీపావళి పండుగ! దేవుని పేర జరిగే తిరునాళ్ళు! జాతరలు! అన్నీ మనిషికి మనోఉల్లాసం కల్గించేవే.

మనం ఇపుడు మన పండుగలను మరచిపోతున్నాం. జనవరి ఒకటవ తారీకును క్రొత్త సంవత్సరంగా ఆచరిస్తూ రాత్రి అంతా మేల్కొంటున్నాం. “వాలంటైన్స్ డే” (ప్రేమికుల రోజు) వంటి వికారపు పండుగలు చేసుకొంటున్నాం.  పాశ్చాత్య ప్రభావానికి తలలు వంచుతున్నాం. మన పండుగలను 'దండుగ'లనుకొని భారతీయ నాగరికతను కించపరుస్తున్నాం. తృణీకరిస్తున్నాం.

హోటళ్ళు వచ్చిన తరువాత ప్రతి రోజూ మనకు విందు భోజనమే,  సినిమాలు, టి.వి.లు వచ్చిన తర్వాత ప్రతిగంటా వినోద కాల క్షేపమే ఆలనాటి వారికి ఈనాటి సుఖాలు  లేవు కాబట్టి పండుగలు, పర్వ దినాలు వుండేవి. పండుగ సమయాలలో ఆత్మీయులతో, బంధువర్గాలతో కన్నబిడ్డలతో, కాలం గడిపే వారందరికీ పండుగలు కావలంటే కావాలి! తప్పక కావాలి!

ఆనాటి మన పూర్వీకులకు 'సండే హాలిడేలు లేవు! సినిమాలు లేవు! టి.వి.లు తెలియవు! పండుగ దినాలే వాళ్ళకు సేలవు రోజులు పండుగ వినోదాలే వాళ్ళకు కాలక్షేపాలు. పండుగరోజుల్లోనే వాళ్ళకు పప్పు భోజనాలు, కొత్త బట్టలు! ఆనాటి, జనం పండుగ కోసం ఎదురుచూచే వాళ్ళు, రోజులు లెక్కించుకొంటూ నిద్ర బోయేవాళ్ళు

Note: ఈ సమాచారం కనుక మీకు నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే,  like చేయండి, share  చేయండి.

No comments