Home Top Ad

Responsive Ads Here

Why to wash your legs before a meal? భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి?


భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి?


“అన్నం పరబ్రహ్మస్వరూపం" అని ఆర్యవాక్యం.

మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఞానవంతుడైన తరువాత ఆహారానికి వున్న విలువను గుర్తించాడు. మానవుని ప్రాధమిక అవసరాలన్నిటిలోకి ఆహారమే ముఖ్యమైనదని తెలిసిన తరువాత సహజంగానే భక్తిభావం పెరిగింది.

“ఆహార ఉపాహారాల యిష్టత లేనివానికి సుఖాపేక్ష వుండదు. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత వుండదు. ఆహారాన్ని సక్రమంగా తీసికొననివానికి ఏ కోరికలు వుండవు” అని చెబుతుంది 'భగవద్గీత'.

పూర్వకాలంలో భోజనశాలను ప్రతినిత్యం ఆవుపేడతో అలికి సున్నంతో నాలుగువైపులా గీతలు (ముగ్గులు) వేసేవారు. దీనివలన సూక్ష్మక్రిములు భోజన శాలలోనికి ప్రవేశించేవి కావు. మనుషులకు హానిచేసే సూక్ష్మక్రిములను చంపే శక్తి (పెన్సిలిన్) ఆవుపేడలోనూ, ఆవు మూత్రంలోనూ వుంది భోజనం చేసిన తరువాత క్రిందపడిన ఆహారపదార్థాలను తీసివేసి మరలా నీటితో అలికి శుభ్రపరిచేవారు. చీమలు మొదలైన కీటకాలు రాకుండా వుండేవి.

మనకు శక్తిని ప్రసాదించి, మన ప్రాణాలను కాపాడి, మనలను చైతాన్యవంతులను చేసి నడిపించే ఆహారాన్ని దైవసమంగా భావించి గౌరవించి పూజించటంలో తప్పులేదుగదా!

మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం. తెలియకుండా అశుద్ధ పదార్థాలను తొక్కుతాం. అదే కాళ్ళతో భోజనశాలలోనికి రావటం వల్ల కుటుంబంలోని అందరి ఆరోగ్యాలకూ హాని జరుగుతుంది కదా! ముఖ్యంగా పసిబిడ్డలకు మరింత హానిదాయకం గదా!

చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యం మాత్రమే చెడుతుంది. కాళ్ళు కడుక్కోకపోతే కుటుంబంలోని వారందరి ఆరోగ్యం చెడి పోతుంది. బయటనుండి ఇంటిలోనికి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవటం కూడా మన ఆచారాల్లో ఒకటి. ఎవరైనా బంధువులు ఇంటికి వచిన్నపుడు ముందుగా కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు (పాద్యం) ఇస్తారు. తరువాత త్రాగటానికి మంచినీరు (అర్ఘ్యం) ఇస్తారు. ఇది మన సత్సాంప్రదాయం.

ఇపుడు మనం ప్రశాంతంగా తీరికగా అన్నం తింటున్నామా! కాలిబూట్లుతో  స్పూన్లతో స్పూన్లతో అన్నం తింటున్నాం. పరుగులు తీస్తున్నాం. “బిజీ! బిజీ!! బిజీ అనవసరమైన అవసరాల కోసం అర్థంలేని జీవితం గడుపుతున్నాం. కాళ్ళు కడుక్కోవటం విషయం అటుంచి చేతులు కూడా కడుక్కోలేని బిజీ అయిపోతున్నాం. ఇక ఆహారాన్ని గౌరవించే ఓపికా తీరికా ఎవరికుంది? ఇప్పటికైనా మించి పోయింది ఏమి లేదు, ఇక నైనా భోజనం చేసేముందు కాళ్ళు కడ్డుకుందాం.

Note: ఈ సమాచారం కనుక మీకు నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే,  like చేయండి, share  చేయండి.

No comments