Home Top Ad

Responsive Ads Here

Both boy and girl child are equal then Why a son is treated great? బిడ్డలందరూ సమానమే గదా కొడుకును గొప్పగా చూస్తారేమిటి?బిడ్డలందరూ సమానమే గదా కొడుకును గొప్పగా చూస్తారేమిటి?"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతేతత్ర దేవతాః" అని మనుస్మృతి. ఇదే మనువు స్త్రీలకు స్వాతంత్య్రం మివ్వటానికి అంగీకరించలేదు. కారణమేమంటి ఆనాటి స్త్రీలు విద్యావంతులు కారు. కేవలం ఈ ఒక్క కారణంచేతనే స్త్రీ స్వాతంత్య్రనికి అడ్డుగోడ కట్టాడు మనువు. అయితే స్త్రీలను గౌరవించాలనీ, ప్రేమించాలనీ, పూజించాలని చెప్పాడు.

ఇది వేల సంవత్సరాల నాటి ధర్మశాస్త్రం.

“ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్" అని అన్నది మహా కవయిత్రి మొల్ల. నిజంగానే యిపుడు విద్యావంతులైన యువతులు అన్ని రంగాలలోనూ మగవారికి దీటుగా పనిచేస్తుండటం హర్షణీయం.
అయితే ఇక్క గమనించవల్సినదేమంటే - ఆడది అబలకాదు సబల అని ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, ఎన్ని  వ్యాసాలు వ్రాసిన  స్త్రీలకు ఒరగబెట్టిందేమి లేదు. స్త్రీ జీవితం ఎన్ని మలుపులు తిరిగిన  చివరి దశకు అబలగానే మిగిలిపోతున్నది. స్త్రీల సమస్యలో చాలావాటికి స్త్రీలే కారణమౌతున్నారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో "స్త్రీకి స్త్రీయే శత్రువు"
- అనే నానుడి నిజమనిపిస్తున్నది.

“బిడ్డలందరూ సమానమే గదా! మరి కొడుకును మాత్రమే గొప్పగా  చూస్తున్నారేమిటి' అనేది ఇపుడు మన ముందున్న ప్రశ్న!

నిష్ఠూరమైన నిజమొకటి మనం గమనించాల్సి వుంది. పశుపక్షుల్లోగానీ, మనుషుల్లోగాని స్త్రీ - పురుషుల సృష్టిలోనే చాలా భేదం వుంది. ఎద్దుకు వున్నంత బలం ఆవుకి వుండదు. మగవానికి వున్నంత శక్తి ఆడదానికి వుండదు. ఇది సృష్టి ధర్మం అని అంగీకరించి తీరాల్సిందే మనం.

తల్లిదండ్రులు మగబిడ్డను ఆడబిడ్డను ఎందుకు తేడాగా చూస్తారు? మగబిడ్డకున్నంత  స్వాతంత్య్రం ఆడపిల్లకు ఎందుకివ్వరు? ఈ వివక్ష భారత దేశంలోనే కాదు అన్ని దేశాలలోనూ ఇప్పటికీ వుంది ముస్లిందేశాలలో (సౌదీ అరేబియా-కువైట్ - ఒమెన్ -నౌజీరియా మొ|| దేశాలు) స్త్రీలకు ఈ నాటికీ ఓటువేసే హక్కులేదు. కృషి కార్మిక రంగాల్లో పురుషుని ఆదాయము రు. 100-00 వుంటే ఆడవారి జీతం రు. 60-00 గా వుంటోంది. నేటికి గూడ జపాన్ - ఫ్రాన్స్ - నార్వే - పశ్చిమ జర్మనీ -బ్రిటన్ - పోర్చుగల్ మొదలైన దేశాలు కూడా ఇంతే. ఫ్రాన్స్ - ఇటలీ -జపాన్ - స్పెయిన్ మొదలైన దేశాల్లో స్త్రీలు గర్భవతులైవుంటే ఉద్యోగమునుండి తీసివేయటం జరుగుతూవుంది. ఏమిటిది? ఎందుకిలా?

అభివృద్ధిచెందిన దేశాలే స్త్రీల విషయంలో వివక్ష చూపిస్తున్నాయి మరి పేద దేశాలలో స్త్రీల గతేంటి? ఈ శతాబ్దంలో కూడా ఈ వివక్ష న్యా యమా? బోర్డు తగిలించుకొన్న మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి? ఏం చూస్తున్నాయి?

తల్లిదండ్రులు తమ బిడ్డల్లో అబ్బాయికే అధికారమివ్వటానికి కారణమేమంటే, ఆడపిల్లకు వివాహం కాగానే భర్తవెంట అత్తవారింటికి వెళ్ళటం - విద్యావంతురాల్ని చేసి ఉద్యోగం ఇప్పించినా సంపాదన మాత్రం భర్తకు, లేదా భర్త తరుపువారికి అందించటం-కన్నతల్లిదండ్రుల్ని చూచే బాధ్యత సాంఘికపరంగా ఆమెకు లేకపోవటం -ఇంటి ఆస్థిలో కట్నం రూపంలో కొంత తీసికెళ్ళటం - ఇరవై సంవత్సరాలు పెంచినా చివరకు చుట్టంలాగా మిగిలి పోవటం - తల్లిదండ్రుల కష్టాల్లో ఏ విధమైన భాగం పంచుకోలేక పోవటం . ఈ కారణాలన్నీ ఆడపిల్లను చిన్నచూపు చూశాయి. చిన్ననాటినుండే ఆడపిల్లను ఎవరికో చెందిన పరాయి పిల్లలాగ చూడటం చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ.

ఇపుడు కాలం మారిపోయింది.

ఈనాటి ఆడపిల్లలు చదువు సంధ్యలు లేని ఆనాటి వాళ్ళు కాదు.
అన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఉద్యోగాలు చేస్తూ వేలకువేల రూపాయలు ఆర్జిస్తున్నారు. కొడుకుల బాధ్యతల్ని తాము నెత్తికెత్తుకొని 'శభాశ్' అనిపిస్తున్నారు. కొడుకు గొప్పవాడా! కూతురు గొప్పదా! అన్నది చర్చనీయాంశం కాదు

పిల్లలు ఎవరైనా బుద్దివంతులుగా పెరిగితేనే వృద్ధాప్యంలో తల్లితండ్రులు మారిపోతున్నారు. వార్ధక్య జీవితానికి ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. కన్నబిడ్డల దయాదాక్షిణ్యంకోసం ఎదురుచూడటం లేదు. లైఫ్ ఇన్స్యూరెన్స్ లు వచ్చినా తరువాత జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రతి నగరంలోనూ వృద్ధాశ్రమాలు వెలుస్తున్నాయి. ఇప్పుడు విద్యావంతులెవరూ 'కొడుకే గొప్ప' అని అనుకోవటం లేదు

పూర్వకాలం మాదిరిగా పుత్రుడంటే పున్నమనరకం నుండి రక్షించేవాడు అని అనుకోవటం లేదు. కాలం మారింది. కాలంతో పాటుగా విలువలు కూడా మారుతున్నాయి.

 అయితే; పాత వాసనలింకా పూర్తిగా పోలేదు. ఏ మార్పు అయినా ఒక్కసారిగా ఒక్కనాటితోనే జరుగదు. కాలక్రమేణా మార్పు సంభవిస్తుంది. యాభై ఏండ్లనాటి నమ్మకాలు, పద్ధతులు, ఆచారాలు ఇపుడున్నాయా! లేవు. గుడ్డి నమ్మకాలు ఒక్కొటొక్కటే పారిపోతున్నాయి. ఆలోచనలలో మార్పు వచ్చింది. వస్తూవుంది.

ఆడపిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులకు భారం కాదు. కొన్ని కుటుంబాలలో మగపిల్లాయె తల్లిదండ్రులకు భారంగా వుంటున్నారు. అయితే చాల ఇండ్లలో తల్లులే ఆడపిల్లల్ని కించపరుస్తూ మగబిడ్డను నెత్తికెక్కించుకుంటున్నారు.ఆడవాళ్ళుఅభివృద్ధి మార్గం వైపు నడవాలంటే ఆడవాళ్ళే సహకరించాల్సి వుంది అన్నది నగ్న సత్యం,

Note: ఈ సమాచారం కనుక మీకు నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే,  like చేయండి, share  చేయండి.


No comments