Home Top Ad

Responsive Ads Here

Should women stay away during periods? స్త్రీలు బహిష్టు సమయాల్లో దూరంగా వుండాలా?


స్త్రీలు బహిష్టు సమయాల్లో దూరంగా వుండాలా?


ఇరువది ఎనిమిది రోజులకొకసారి అండం విడుదల కాబోయేముందు స్త్రీలు రజస్వల కావటం సృష్టినియమం. మూడు రోజుల నుండి ఐదురోజులవరకు రజస్వలా సమయంగా పాటించటం, జరుగుతూవుంది. ఈ దినాలలో స్త్రీలు అనారోగ్యంగా వుండటం సహజమే. కడుపునొప్పి, తలనొప్పి, వళ్ళునొప్పులు జ్వరం తగిలినట్లుగా వుండటం, చిరాకు, కోపం, విశ్రాంతికోరటం వంటివి వుంటాయి. శరీరమంతా బరువుగా భారంగా కూడా వుంటుంది. అందుకే ఈ నాలుగు రోజులు స్త్రీకి విశ్రాంతి కల్పించే వుద్దేశ్యంతో ఇంటిపనులకు దూరంగా ఉంచారు పూర్వీకులు. అంటుకోకూడదనే నియమం కూడా విధించారు.

ఒకరకంగా ఇది స్త్రీలకు వరమే!

ఈ నిషిద్ధ  సమయంలో స్త్రీలు ఇంటిపనులకు వంటపనులకు దూరంగా ఉండటమే కాదు, భర్తకు, పడకగదికి కూడా దూరంగా వుండాలి. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా వుండేవి. ఎప్పుడూ ఎవరో ఒకరు రజస్వలగా ఉండేవారు. అందుకని స్త్రీల కోసమే రజస్వలాగది ఒకటి ప్రత్యేకంగా వుంచేవారు. ఆ గదిలో వారికి కావలసిన సదుపాయాలన్నీ వుండేవి.

 ఈ సమయంలో స్త్రీ, పురుషుల కలయిక నిషిద్ధం. ఈ కారణంవల్ల కూడా స్త్రీలను ఋతుసమయంలో ముట్టరాదన్న కట్టడి చేశారేమో! ఏదిఏమైనా ఈ సమయంలో  స్త్రీలకు విశ్రాంతి నివ్వటం చాలా మంచి విషయం. 

ఆనాటి స్త్రీలందరూ గృహిణులే. ఈనాటి స్త్రీలు ఎందరో ఉద్యోగాలు చేస్తున్నారు గదా. ఈనాటివారికి ఇవన్నీ కుదరవు. ఉద్యోగ ధర్మం మరచి ఇంట్లో కూర్చుంటే కుదరదు. ఉమ్మడి కుటుంబాలు పోయా యిప్పుడు. ఎవరికివారు స్వేచ్చగా వేరు వేరుగా వుండే ఈ రోజుల్లో పూర్వాచారాలకు చెల్లుచీటీ వచ్చింది. 

పూర్వకాలంలో, ఋతుక్రమం ప్రారంభమైన ఐదవనాటి రాత్రి భార్యతో భర్త కలసి నిద్రించవల్సిందే! ఇది ఆనాటి నియమం. ఎందువలననంటే ఆ కాలంలో  ఎక్కువమంది సంతానాన్ని కనటమే గొప్పగా వుండేది.

బహుసంతానవతులైన స్త్రీలను అందరూ దేవతగా గౌరవించి పూజించే వారు. సంతానమే ఆస్తిగా భావించే రోజులు పోయి పరిమిత కుటుంబమే మంచిది అనే రోజులు వచ్చాయి. నాటి ఆచారాలు నేడు అపహాస్యమై పోతున్నాయి.

పూర్వీకులు దూరదృష్టితో సదుదేశ్యంతో కొన్ని ఆచారాలను విధించారు. మూఢాచారాలను వదలివేసి శాస్త్రీయ ఆచారాలను, పాటించటం మంచిదే. పురాణ మిత్యేవన సాధునర్వమ్" అన్నట్లు గానే పాత ఆచారాలన్నీ చెడ్డవి కాదు. కొత్త ఆచారాలన్నీ మంచివి కాదు. ప్రతిదానిలోనూ మంచి చెడులు వుంటాయి.

Note: ఈ సమాచారం కనుక మీకు నచ్చితే , నలుగురికి ఉపయోగ పడుతుంది అని మీకు అనిపిస్తే,  like చేయండి, share  చేయండి.

No comments