Home Top Ad

Responsive Ads Here

Check your horoscope here if you are born on 2, 11, 20, 29 date. మీరు 2, 11, 20, 29 తేదీలలో జన్మించారా అయితే మీ జాతకాన్ని ఇక్కడ తనిఖీ చేసుకోండి


మీరు 2, 11, 20, 29 తేదీలలో జన్మించారా? అయితే మీ జాతకాన్ని ఇక్కడ తనిఖీ చేసుకోండి 


2 సంఖ్య వారు ఎవరు ?
జనవరి మొదలు డిసెంబరు వరకు గల ఇంగ్లీష్ నెలలు పన్నెండు. ఈ పన్నెండు నెలల్లో ఏ నెలలోనైనా సరే 2 11 20 29 ఈ తేదులల్లో పుట్టినవారు 2 సంఖ్య వారని గుర్తించాలి.

2-వ తేది పుట్టినవారు 2 సంఖ్య వారనేది స్పష్టంగానే తెలుస్తున్నది. 11-వ తేదీలో ఉన్న రెండు ఒకట్లను 1 +1 అని కూడితే 2 సంఖ్య వస్తుంది. 20 - వ తేదీలో సున్న తీసివేస్తే 2 సంఖ్యే మిగులుతుంది, 29 వ తేదీని 2 + 9 =11 = 1 + 1  అని కూడితే ఆఖరున వచ్చే సంఖ్య 2 మాత్రమే.

ఆ విధంగా 2, 11, 20, 29 తేదులలో పుట్టిన వారిని 2-సంఖ్య వారుగా గుర్తించాలి.

2 - సంఖ్యకు చెందిన గ్రహము
సూర్యాది నవగ్రహాలలో చంద్రుడు 2 సంఖ్యకు చెందిన వాడు. సూర్యుని తరువాత రెండవవాడుగా జ్యోతిశ్శాస్త్రంలోనూ, ఇతర శాస్త్రాలలోను పరిగణించినందువల్ల చంద్రుడు 2 సంఖ్యకు చెందినవాడనటం సమంజసమే . సూర్యుడు - ఆత్మకారకుడైతే
చంద్రుడు మనఃకారకుడు. అంచేత చంద్ర గ్రహానికి జ్యోతిశాస్త్రంలో వివరించి ఉన్న స్వరూప స్వభావాలు, గుణగణాలు ఇవన్నీ  2  సంఖ్య వారిలో చూడవచ్చు.

2 సంఖ్య వారి ఆకారము
వీరిలో ఎక్కువమంది మంచి ఆకారపుష్టితో ఆకర్షమైనా రూపంతో ఉంటారు. పుష్టికి తగిన ఎత్తుకూడా ఉంటుంది. చిన్న చెవులు, గుండ్రని అందమైన కండ్లు, దళసరైన పెదవులు,
మెత్తని వెండ్రుకలు, ముందుకు వచ్చిన గడుపు ఇవన్నీ 2-సంఖ్య వారని మనకు తెలిసే చిహ్నాలు.

గుణగణాలు
స్వభావంలో, 2 సంఖ్య వారు చంచలమైన మనస్సు కలవారు. అదీగాక సందేహ మనస్కులు కూడాను. అంచేత ఏ పని చేసినా ముందు ఆలోచించుకొని నిదానంగా విజయవంతంగా కొనసాగించే వద్దతి పిరికి ఉండదు. ప్రతిబిషయంలోనూ తొందరపడి పూనుకోవడం, మళ్ళీ దాన్ని మానుకోవడంగా ఉంటుంది. స్వయంగా నిర్ణయించి చేసే నిదాన బుది లేకపోయినా ఇతరుల మాటకైనా విలువ యిస్తే వారు సూచించే పద్ధతులలో తమ పని సాధించుకోవచ్చు. కాని పరాయివారిని నమ్మినవన్నీ చిత్తవృత్తితో కనిపిస్తూంటారు. తమ వ్యవహారాలు అటుంచి, ఇతరులకి తమ వల్లనే ఏదైనా సహాయం చేయటానికి వీలుంటుందా అనే ప్రయత్నంలోనే వీరు ఉంటారు. ప్రాపంచిక చింతకన్నా వీరికి అధ్యాత్మిక పిపాస ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చర్చలు చేయడమంటే, ఎంత కాలం గడిచింది వీరికి తెలియదు. తమ సమస్యలు గురించి పలువురి మధ్య పెట్టకుండా, ఏకాంతంలో స్వయమే చింతించి అంత వాటికి సదుపాయాలు వెతుక్కునే అలవాటు కలవారు.

ప్రకృతి సౌందర్యాన్ని రసించటంలోనూ, నీటిలో ఈత కొట్టడమంటేనూ బరికి అమిత ఆనందము. వీరికి సహజంగా ఉన్న ముక్కోవము, తొందరబాటూ కొన్ని సమయాలలో వీరి కార్య సిద్ధికి  విఘ్నకరంగా ఉంటాయి. జీవిత రంగంలో విసిగి వేసారిపోయిన రెండు సంఖ్యవారు కొందరికి జలగండమే శరణమౌతుంది.

స్వతంత్ర జీవితంలో వీరికి నమ్మకం లేకోవడం వల్ల ఇతరులకి అణిగి ఉండి, సేవకవృత్తి కైనా తయారై కాలం గడిపే స్వభావం వీరికి సహజంగా ఉంటుంది.

భూతాలు పిశాచాలంటే వీరికి భీతి ఎక్కువ. 2 సంఖ్య గల ఆడవారు మరింత పిరికిపందలుగా ఉంటారు. కొంచెం కదిలించినా బెదిరించినా అమితంగా గాబరా పడిపోయేవారు. అంచేత ఈలాటివారితో, మెలకువగా వ్యవహరించాలి. ఆకుపచ్చ వర్ణంగల వస్తువుల్ని, వస్త్రాలనూ కొని ఉపయోగించడమంటే వీరికి ప్రీతి ఎక్కువ. ఎల్లప్పుడు తమ్ము అలంకరించుకోవడంలో ఎక్కువ కాలాన్ని నియోగిస్తూంటారు.

దాంపత్య జీవితం
వీరికి దాంపత్య జీవితం ఆనందంగానే ఉంటుంది. వీరు జన్మించిన తేది సమిష్టి సంఖ్య కూడా 2 గా ఉండి, 3, 5, 8 సమిష్టి సంఖ్య వారిని పెండ్లి చేసుకొంటే మరింత ఆనందకరమైన దాంపత్య జీవితంగా ఉంటుంది. అదీగాక, వీరు 25-30 ఏళ్ల వయసు మధ్యలో పెండ్లి చేసుకొంటే మంచిది. ప్రేమ వ్యవహారంలో వీరికి నూటికి నూరుపాళ్ళు విజయమే లబిస్తుంది.

ఆర్థిక పరిస్థితి
శుక్లపక్షము, కృష్ణపక్షము అని చంద్రుడికి ఉండేలాగ వీరి ఆర్థిక పరిస్థితులు ఒక సమయంలో పెరగడం మరో సమయంలో తరగడం ఈ విధంగా జీవితమంతా హెచ్చు తగ్గులుతోనే గడుస్తుంటుంది. మొత్తం మీద వీరు చేస్తూన్న వృత్తి వ్యాపారాలు వీరికి లాభదాయకంగానే ఉంటాయి.

ఆరోగ్యము
2 సంఖ్య వారిని కడుపుకు సంబంధించిన  అజీర్ణం వంటి వ్యాధులే అప్పుడప్పుడు ఎక్కువగా బాధిస్తుంటాయి. కొందరికి స్త్రీ మూలకమైన రోగాలు కలుగవచ్చు. హృదయానికి సంబంధించిన మనోవ్యాధులు కొందరిని ఎక్కువగా బాధించ వచ్చు. అంచేత దుఃఖకరమైన వర్తమానాలను వీరికి చెప్ప కుండడమే మంచిది. చంద్ర గ్రహం శీతల స్వభావం కలగవటం వల్ల శీతల వ్యాధులు వీరికి ఎక్కువగా వస్తుంటాయి. గ్రహ   దౌర్బల్యం కలవారైన కొందరికి జలగండం వచ్చే అవకాశం ఉంటుంది. వీరి అరిచేతిలో చంద్ర స్థానంలో వలయ చిహ్నం ఉంటే నీటి మూలకమైన మరణం తప్పదు. కనుక, ఇట్టివారు నీటివద్ద హెచ్చరికలో ఉండడం బాగు.

వృత్తి వ్యాపారాలు
ఈ 2 సంఖ్య వారిలో ఎక్కువ మంది వ్యాపార జీవనమే గడుపుతుంటారు. వ్యాపారంలో ఇతరుల పొతు వీరికి పనికి రాదు. అంచేత స్వతంత్రంగా వ్యాపారం చేయటమే వీరికి లాభదాయకంగా ఉంటుంది. గొప్ప గొప్ప వ్యాపారస్తులు ఈ సంఖ్యకు చెందిన వారుగా ఉంటారు. గుడ్డల మిల్లులు, ఇతర కర్మాగారాలు పెట్టుకొంటూ కొత్త కొత్త విలాస వస్తువుల్ని తయారు చేసే వారు కూడా ఉన్నారు. ఉద్యోగంలో కొందరు ప్రభుత్వోద్యోగులుగా ఉన్నత పదవుల్ని అలంకరిస్తారు. అందుకు తగిన జీత భత్యాలు, సేవకులు మొదలైన హంగామాలతో రాణిస్తుంటారు.

చక్కని కవితలు గేయాలు రచించే వారునూ, హరికథలు, ప్రసంగాలు చేసే వారును కొందరు ఈ 2 సంఖ్య వారుంటారు, చంద్రబలం లేని ఈ సంఖ్యవారు కొందరు ఇంటిపనులు చేసే సేవకులుగా, ఓడలు నావలలో పనిచేసే వారుగా, మిడ్ ఓయిఫ్లుగా, నర్సులుగా పని చేస్తుంటారు. ఇవన్నీ లేకుండా ప్రపంచాన్ని చుట్టి రావాలనే కుతూహలం కలవారు కూడా ఈ 2 సంఖ్యకు చెందినవారే.

చంద్రుని కాలము
ఆంగ్ల మాన రీత్యా జూన్ నెల 21-వ తేది మొదలు - జూలై నెల 22వ తేదీ వరకు చం చుడికి సంబంధించిన కాలము. తరచు 2 - సంఖ్యవారు ఈ తేదీల మధ్య జనించిన వారై ఉండవచ్చు. సోమవారము  చంద్రునికి చెందిన వారము. కాల పరిమితిలో సుమారు ఒక గంట కాలను చంద్రుడిది.  రాత్రి పూట బలం కలవాడు చంద్రుడు. ఆ ఆంశాలను 2- సంఖ్య వారితో అన్వయించుకోవాలి.

చంద్రుని దేశము
చంద్రునిది ఉత్తరపు దిక్కు చెరువులు, కుంటలు, బావులు, స్నానగది ఇంకా ఇతర చలవ ప్రదేశాలు చంద్రునికి చెందినవి. 2 సంఖ్య వారు ఉత్తర దిక్కు ముఖంగా ప్రయాణాలు చేసిననూ ఏ పనినైనా మొదలు పెట్టినను, కార్యాలయాలలో ఉత్తర ముఖంగా కూర్చున్ననూ కార్యసిద్ధి కలుగుతుంది.

చంద్రుని రత్నము
ఆ చంద్రునికి సంబందించిన కన్నము ముత్యము. అంచేత, చక్కగా పరీక్షించిన ముత్యాన్ని ఉంగరంలో కానీ, మెడ గొలుసులోగాని పొడిగించి ధరిస్తే ఈ సంఖ్య వారికి గ్రహబాదలు, శత్రుబాధలు, ఋణబాధలు ఇవన్నీ తొలగిపోతాయి. వీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో విజయాన్నిస్తుంది. చంద్రునికి సంబంధించిన లోహము వెండి.

చంద్రుని వర్ణము
తెలుపు వర్ణము చంద్రునికి చెందినది. ఆకుపచ్చ కూడా అతనికి చెందినదే అని అనుభవం మీద విమర్శకులు నిర్ణయించారు.

అనుకూలమైన తేదులు
2 సంఖ్య వారికి ప్రతి ఇంగ్లీషు నెలలోనూ 2, 7, 11, 16, 20, 25, 29 ఈ తేదులు అన్ని పనులకూ అనుకూలంగా ఉంటాయి. ఈ తేదులలో వీరు మొదలు పెట్టే పనులు బాగా కొనసాగుతాయి. గొప్ప వారితో సంప్రదింపులు, మంచి ధనాదాయమూ ఈ తేదులలో లభించే అవకాశం ఉంటుంది.

ప్రతికూలమైన తేదులు
4, 8, 9, 18, 27 ఈ తేదులు చాలా ప్రతికూలంగా ఉంటాయి. తతిమ్మావి ప్రయత్నం మీద ఫలితాన్నిస్తాయి. అంచేత పై తేదులలో ఏదైన కొత్తగా మొదలు పెడితే ఫలితం ఉండడు.

గ్రహప్రీతి
సోమవార వ్రతము, దుర్గాపూజ, దుర్గాస్తోత్ర పారాయణము ఇవి చేస్తుంటే చంద్రగ్రహ ప్రీతి కలుగుతుంది.

No comments