Home Top Ad

Responsive Ads Here

Check your horoscope here if you are born on 1, 10, 19, 28 date, మీరు 1, 10, 19, 28 తేదీలలో జన్మించారా అయితే మీ జాతకాన్ని ఇక్కడ తనిఖీ చేసుకోండి


మీరు 1, 10, 19, 28 తేదీలలో జన్మించారా? అయితే మీ జాతకాన్ని ఇక్కడ తనిఖీ చేసుకోండి 1-సంఖ్య వారు ఎవరు ?

ఒక సంవత్సరానికి  పన్నెండు  నెలలు గదా! ఆ పన్నెండు నెలలను జనవరి మొదలు డిశంబరు వరకని లెక్క పెట్టుకొందాం. ప్రపంచమంతటా వ్యవహారంలో ఉన్నందువల్లనూ, ప్రాచ్య పాశ్చాత్య రేఖా శాస్త్రజ్ఞులు, సంఖ్యా శాస్త్రజ్ఞులు వీరందరూ ఇంగ్లీషు నెలలు, తేదులు వీటినే ఆధారంగా పెట్టుకొని జీవిత ఫలితాలు చెబుతుండడం వల్లనూ మనం కూడా ఇంగ్లీషు తేదులు, నెలలు వీటినే వ్యవహారంలో పెట్టుకొందాం.

అంచేత, పై పన్నెండు నెలలలో ఏ నెలలో నైనాసరే - 1,10, 19, 28 - ఈ తేదులలో పుట్టినవారిని 1 సంఖ్య గలవారని గుర్తు పెట్టుకోవాలి.

అది ఎలాగంటే - పై చెప్పిన 1, 10, 19, 28 తేదులలో 1-వ తేది 1 సంఖ్యకు చెందిందనే విషయం స్పష్టమే. 10-వ తేదీలో సున్నకు ప్రత్యేకంగా విలువ లేదు. అంచేత సున్న తీసివేస్తే ఒకటి మాత్రమే మిగులుతుంది.

19-వ సంఖ్యను 1 + 9 అని కూడితే 10 వస్తుంది. ఆ 10 లో ఉన్న సున్న తీసివేస్తే 1 మిగులుతుంది. అలాగే, 28 అనేదాన్ని 2+8 అని కూడితే పదే వస్తుంది. సున్న తీసేస్తే మిగిలేది 1 మాత్రమే. అందుచేత, 1, 10, 19, 28 ఈ నాలుగు   తేదులలో పుట్టినవారు ఎవరైనా నరే, వారందరూ ఒకటి సంఖ్యవారని తెలుసుకోవాలి.

1- సంఖ్యకు చెందిన గ్రహము
సూర్యాది నవగ్రహాలలో సూర్యుడు ఒకటి అనే సంఖ్యకు చెందినవాడు. అతడు నవగ్రహాలలో ప్రథముడు ; నాయకుడు కూడా. సమస్త జీవరాసుల ఆత్మస్వరూపమే సూర్యుడని శాస్త్రాలు ఉదోషిస్తున్నాయి. అంచేత, గ్రహ నాయకుడైన సూర్యుడు సంఖ్యలలో మొదటిదైన ఒకటి సంఖ్యకు చెందినవాడనటంయుక్తి సంగతంగానే ఉన్నది.

ఒకటి సంఖ్యకు చెందిన గ్రహం సూర్యుడవటంవల్ల, ఆ సంఖ్యకు చెందినవారిలో, సూర్యగ్రహానికి జ్యోతిశ్శాస్త్రంలో వివరించి ఉన్న స్వరూపము, స్వభావము, గుణగణాలు ఇవన్నీ ఉంటాయి.

1- సంఖ్య వారి ఆకారము 
ఒక టి సంఖ్య వారు మధ్యరకమైన ఎత్తుకలవారుగా ఉంటారు . పొడన భుజాలు, ఎత్తైన నొసట వారికుంటాయి. వెంట్రుకలు ప్రకాశవంతంగా మెరుస్తూ దళసరిగా ఉంటాయి. చక్కగా ధనుస్సువలే వంపులు తిరిగిన కనుబొమ్మలు, గట్టిగా ఉన్న పండ్లు వీరికి ఉంటాయి.

గుణగణాలు
సింహంవంటి పౌరుషము, దైర్యమూ కలవారు. తమ మనోభావాలను లక్ష్యాలనూ  వదిలి పెట్టని  పటుదల స్వభావం కలవారు వీరు. ఇతరులకి తాము అణిగి ఉండడంకంటే, తమకే ఇతరులు అణిగి ఉండాలనే చిత్తవృత్తి కలవారు. అన్నిటియందునూ తామే ముఖ్యవాక వహించే సమర్థత కలవారు. సేవావృతి కన్న స్వతంత్ర జీవితం గడపటంలోనే వీరికి ప్రీతి ఎక్కువ.

వీరు ఎక్కువగా మాట్లాడే స్వభావం కలవారు కాదు ఐనా, మాటాడవలసి వస్తే- భావపుష్టితో, ఛలోక్తిగా, హాస్యరస పూరితంగా మాటాడేవారు.

వీరిని సకల కళాప్రపూర్ణు లనవచ్చు. అంటే,  ఏ కళనైననూ, ఏవిద్య నైననూ త్వరలో నేర్చుకొనే నైపుణ్యము, ఉత్సాహమూ వీరికి ఉంటుంది. పరాయివారి సుఖదుఃఖాలను చూస్తే కరిగి పోయేవారు. వీరి హృదయం స్వచ్చంగా ఉంటుంది. కల్లాకపటము లేకుండా అందరితోనూ అన్యోన్యంగా వ్యవహరిస్తారు. దేనినీ రహస్యమని మనసులో దాచి పెట్టుకో లేకుండా ఇతరులకి చెప్పివేస్తారు.

తాము చేసిన తప్పును, ఉప్పునూ ఇతరులకి చెబుతూ, ఎప్పుడూ హృదయాన్ని స్వచ్ఛంగా పెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉంటారు. ఈలాటి నిష్కళంక స్వభావు లవటం వల్ల, టక్కర్లు మోసగాళ్ళంటే వారికి గిట్టదు.  తమకు సహాయం చేయాలని కోరుతూ ఇతరుల దగ్గరికి వెళ్ళడం వీరికి చేతకాని పని. కాని, వీరి పరిస్థితి కనిపెట్టి ఎవరైనా సహాయంచేస్తే, ఆ సహాయాన్ని కృతజ్ఞతతో అంగీకరిస్తారు. తెల్ల వస్త్రాలు ధరించడమంటే వీరికి ఎక్కువ ఆశ.

జన సమూహంలో కంటే ఏకాంతంలో ఉండడమంటే వీరికి ప్రీతి. రాత్రిపూట ముందుగా పడకకు వెళ్లడమంటే వీరికి పట్టదు. ఎప్పుడయినా ఎక్కువ నిద్రపోతే కాలం వ్యర్ధమై పోయిందని చింతించేవారు వీరు. ప్రయాణాలు చేయడ మంటేను, కొండలు అడవులు సెలయేళ్ళు వంటి ప్రకృతి దృశ్యాలను చూడడమంటేను వీరికి మక్కువ ఎక్కువ.

దైవ విశ్వాసం గల ఆస్తికులు వీరు. కాని దైవం మీదే ఆధారపడిన దైవ పిచ్చిగా ఉండరు.

దాంపత్య జీవితము
వీరికి కొంచెం అలస్యంగానే వివాహం జరుగుతుంది. వీరి కుటుంబ జీవితం అంతగా ఆనందకరంగా ఉండదు. సదాసర్వ కాలమూ దంపతుల మధ్య ఏదో ఒక విధమైన తగాదాలు పోట్లాటలతో జీవితం గడుస్తుంటుంది. ముఖ్యంగా, ఈ ఒకటి సంఖ్య వారికి ఒకటి సంఖ్యవారే భార్యగానో భర్తగానో, కుదిరిఉంటే, పై చెప్పిన వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. అంచేత ఒకటి సంఖ్య వారితో దాంపత్యం కుదుర్చుకోకుండా చూచుకోవాలని సంఖ్యా శాస్త్రం హెచ్చరిక చేస్తున్నది.

ఆర్థిక పరిస్థితి
వీరికి ఆర్థిక పరిస్థితి తృప్తికరంగా ఉండదు. ఎప్పుడూ డబ్బులకై పాటులు పడుతూ, కొరతలు తీర్చుకోలేక బాధలు పడుతూ ఉంటారు. అవసరానికి పనికివచ్చే రీతిలో వీరి దగ్గర ఎప్పుడూ డబ్బులు చేరి ఉండవు. కాని, ఆర్థిక సౌష్టవం కంటే దైవానుగ్రహం వీరికి ఎక్కువగా ఉంటుంది. జీవితాంతంలో వీకు ఒకింత సుఖాలను అనుభవిస్తారు. అంటే, సుమారు 40 ఏండ్లకు పైబడిన తరువాతనే వీరికి ఉద్యోగంలో లేదా వృత్తి వ్యాపారాలలో స్థిరత ఏర్పడుతుంది. అంతవరకు ఒక అనిర్ణిత మైన (నిలకడలేని) జీవితమే సాగుతుంటుంది.

ఆరోగ్యము
ఒకటి సంఖ్యవారు ఆహార విషయంలో ముందు జాగ్రత్త కలవారు. అందువల్ల, వీరిని కడుపునొప్పి వంటి ఉదరరోగాలు అంతగా బాధించవు. అయినా వీరిలో పలువురు రొమ్మునొప్పులతో బాధలు పడుతుంటారు. అంతేగాక, వాతపిత్త శ్లేష్మాలనే త్రిధాతువులలో పైత్యానికి సంబంధించిన రోగాలు, ఉష్ణబాధలూ వీరికి అప్పుడప్పుడూ కలుగుతాయి.

ఈ ఒకటి సంఖ్యవారికి కంటి చూపు బాగుండడం అరుదు. వీరిలో చాలామంది పిన్న వయసులోనే కండ్ల జోళ్ళు తగిలించు కోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు.

వృత్తి వ్యాపారాలు
ఒకటి సంఖ్యవారు కొలువులో ఉంటే, ఆఫీసు మేనేజర్లుగా గానీ, ఐ. ఏ. యస్. వంటి గొప్ప అధికారాలు వహించే వారుగా గానీ, ధార్మిక సంస్థల ట్రస్టీలుగా గానీ, ఇంకా ఎక్కువ అధికారము కల ఒక పదవిలో గానీ ఉంటారు. వీరి ఉద్యోగాలు ప్రత్యక్షంగా గవర్నమెంటు ఉద్యోగాలుగా, లేదా గవర్నమెంటులో ఎక్కువ సంబంధం పెట్టుకొన్న విగా ఉంటాయి.

సూర్యుని కాలము
ఆంగ్ల సంవత్సర రీతిగా జూలై 23 వ తేది మొదలు ఆగష్టు 22 వ తేదీ వరకు సూర్యుని కాలము. ఒక టి సంఖ్య గలవారు బహుశ : ఈ కాలంలో పుట్టిన వారుగా ఉండవచ్చు. ఆదివారము సూర్యునికి చెందినది. కాల పరిమితిలో ఆరు నెలల కాలము సూర్యునిది. సూర్యుడు పగటిపూట బలం కలవాడు. ఈ విషయా లన్నీ ఒకటి సంఖ్య కలవారితో అన్వయింప చేసుకోవాలి.

సూర్యుని దేశము
సూర్యుని దిక్కు, తూర్పు ప్రారనా. సలాలు, భోజన శాలలు వంటి ప్రదేశాలు సూర్యునికి చెందుతాయి. ఏ పని చేసిననూ ప్రయాణాలు చేసిననూ తూర్పు ముఖంగా మొదలు పెట్టడం మంచిది. కార్యాలయాలలో తూర్పు ముఖంగా కూర్చోడం అధికార వృద్ధిని ఇస్తుంది.

సూర్యుని రత్నము
శాస్త్రాలలో మాణిక్యము సూర్యునికై విధించిన రత్నము. ఈ రత్నాన్ని ధరించడం విజయాన్నిస్తుంది. మాణిక్య రత్నం దొరకడం కషం. అంచేత, పసుపుడాలు కొడుతున్న వర్రరత్నాన్ని ఉంగరంలోకాని మెడ గొలుసులో కానీ పొదిగించి ధరిస్తే సర్వకార్యాలలో విజయమే సిద్ధిస్తుంది. తామ్రము (ఇత్తడి) సూర్యునికి చెందిన లోహము.

సూర్యుని వర్ణము
సాయంకాల సూర్యుని ప్రకాశంవంటి ఎరుపు వర్ణమే సూర్య గ్రహానికి " వర్ణము. " ఈ వర్షముకల ఆభరణాలను వస్త్రాలనూ ఒకటి సంఖ్య వారు ధరిస్తే చాలా మంచిది.

అనుకూలమైన  తేదులు
ఒకటి సంఖ్య వారికి, ప్రతి నెలా 1, 4, 10, 19, 22, 28, 31 ఈ తేదులు బాగుంటాయి. ఈ తేదులలో వీరు తలపెట్టే పనులలో వీరికి విజయము, ఎక్కువ ధనా దాయము, గొప్పవారి సంప్రతింపులు ఈలాంటి మంచి ఫలితాలన్నీ ఏర్పడుతాయి.

ప్రతికూలమైన తేదులు
ప్రతి నెలా 8, 17, 26 ఈ లేదులు వీరికి ప్రతికూలంగా ఉంటాయి. అంచేత,  కొత్త  ప్రయత్నాలేవి. ఈ రోజులలో చేయకుండడం మంచిది. పెద్దల్ని కలుసుకోవడం ఈ తేదులలో మానుకోవాలి. 

గ్రహస్థితి 
ఒకటి సంఖ్యవారు సూర్య దేవత ప్రీతికరంగా ఆదివారవ్రతము, ఆదిత్యహృదయం స్తోత్ర పారాయణము చేస్తుంటే మంచి ఆరోగ్యము, ప్రయత కార్యసిద్ధి కలుగుతాయి.


No comments